దేశ రాజధాని ఢిల్లీ రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుంది. అక్కడున్న వారు లగ్జరీగా బ్రతకడానికి సకల వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు కాని సహజసిద్దమైన ప్రకృతి వాతావరణాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల అనుభవించడానికి అన్ని వసతులున్నా ఆనందంగా ఉండడానికి వారి ఒంట్లో ఆరోగ్యం ఉండటం లేదు. ఆరోగ్యాన్ని మించిన ధనం, ఆనందం మరోటి లేదన్న విషయం తెలిసిందే.


ఇంట్లోని అందరి ఒంట్లో రోగాలుంటే ఆ ఇల్లు నరకం అంటారు పెద్దలు. ఇప్పుడు ఢిల్లీ ఇలాగే మారింది. అక్కడ గాలి నాణ్యత మరింత క్షీణించి,  వాయు కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని నిర్దారణైంది. ఢిల్లీలో వాయుకాలుష్యం అనేది తీవ్ర సమస్యగా మారింది. ఈ పరిస్దితిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్కూలు విద్యార్థులకు కాలుష్య నిరోధక మాస్క్‌లను పంచారు. ఇప్పటికే మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, ఇండియా గేట్ ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ బాగా దెబ్బతిన్నట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.


ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఢిల్లీవాసులకు 50 లక్షల మాస్కులు పంచుతున్నామని చెప్పారు. ఇకపోతే ఇక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి ఉపశమనం కల్గించే చర్యల్లో భాగంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండేసి మాస్క్‌లు చొప్పున పంపిణీ చేస్తున్నట్టు కేజ్రవాల్ మీడియాకు తెలిపారు.


ఇకపోతే వాయుకాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ మాస్క్‌లు ధరించి బయటకు వెళ్లాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఢిల్లీ సర్కార్ ఇటీవల వాతావరణ కాలుష్యం దృష్ట్యా ఔట్‌డోర్ క్రీడా కార్యక్రమాలను తగ్గించుకోవాలని అన్ని పాఠశాలలకు సూచనలిచ్చింది. ఇకపోతే చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ డేంజర్ జోన్ లోకి వెళ్తుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: