రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీతో మాట్లాడించాలని చంద్రబాబునాయుడు చేసిన అన్నీ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా వంశీ రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. వంశీ రాజీనామా తనకు అందిన దగ్గర నుండి చంద్రబాబు కిందా మీదా అయిపోతున్నారు. ఎందుకంటే వంశీతో మొదలైన రాజీనామా ఒక్కడితోనే ఆగుతాయో లేకపోతే మరిన్ని రాజీనామాలుంటాయో తెలీక టెన్షన్ పడిపోతున్నారు.

 

అందుకనే తన రాజీనామాను ఉపసంహరించుకునేట్లు చేయాలన్న ఉద్దేశ్యంతో విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణకు చంద్రబాబు బాధ్యత అప్పగించారు. అయితే వారిద్దరితోను వంశీ టచ్ లోకి రాలేదు. ఎంఎల్ఏతో మాట్లాడేందుకు వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రెండు రోజుల పాటు ప్రయత్నాలు చేసి అలిసిపోయి చివరకు విరమించుకున్నారు.

 

అయితే అనూహ్యంగా బుధవారం రాత్రి వంవీనే ఎంపి ఇంటికెళ్ళారు. దాంతో అప్పటికప్పుడు కొనకళ్ళను కూడా పిలిపించారు. దాదాపు మూడుగంటలసేపు వీళ్ళ ముగ్గురి మధ్య చర్చలు జరిగాయి. చర్చల సారంశం బయటకు పొక్కలేదు కానీ తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి ఎంఎల్ఏ ఇష్టపడలేదని సమాచారం. తాము చెప్పాల్సిందంతా చెప్పామని నిర్ణయం తీసుకోవాల్సిందే ఎంఎల్ఏనే అన్న ఎంపి మాటలను బట్టే అర్ధమవుతోంది ఏం జరుగుంటుందో.

 

వంశీ రాజీనామాను కూడా సానుభూతిగా మార్చుకుని జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుదామని చంద్రబాబు చేసిన అన్నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధికారం పార్టీ బెదిరింపులకు తట్టుకోలేకే తమ ఎంఎల్ఏ రాజీనామా చేసినట్లు చంద్రబాబు ఒకటే గోల చేస్తున్నారు.

 

అయితే పార్టీలో కనబడని శతృవులతో పోరాడలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వంశీ తన లేఖలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. ఎంఆర్వో సంతకాలు ఫోర్జరీ చేసిన ఫిర్యాదుపై వంశీ మీద కేసు నమోదైంది. అదేమీ తప్పుడు కేసు కాదన్న విషయం అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు పదే పదే అవే ఆరోపణలు చేస్తుంటారంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: