నాటి రోజులతో ఇప్పటి రోజులను పోల్చుకుంటే మనిషికి ఆధునిక సౌకర్యాలు పెరిగి, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఏది కోరుకున్న చిటికెలో సమకూర్చుకునేలా మారిపోయాడు. ఇప్పుడున్న పరిస్దితుల్లో తన జీవనానికి ఏది తక్కువైన దాన్ని పరిశోధించి సాధించే వరకు వదిలిపెట్టని మనిషి, తన ఆరోగ్యం విషయంలో మాత్రం అభివృద్ధి సాధించలేదని చెప్పవచ్చూ. పచ్చని ప్రకృతిని  నాశనం చేస్తూ, తాను సాధిస్తున్న అబివృద్ధిని చూసి గర్వపడే మనిషి నిజంగా మేధావని ఎలా ఒప్పుకుంటున్నాడో తెలియదు.


మనిషికి స్వేచ్చ ఉన్నది ఆనందంగా జీవించడానికి కాని ఆ స్వేచ్చతో, ఈ ధరణిని అగ్నిగోళంలా మారుస్తున్నాడు. అంతేకాకుండా నీటికాలూష్యం, వాతవరణ కాలూష్యం. తినే తిండి కూడా చివరికి కల్తీనే. ఇలాంటివి మనిషి మనుగడను, ఉనికిని ఎక్కువకాలం నిలుపలేవు. ఇప్పుడున్న ఆధునిక జీవనంలో కాలుష్యం అనేది ఈ భూమండలం మీద ఎంత ప్రభావం చూసిస్తుందో మనందరికి తెలిసిందే. కాలుష్యం అనేది రకరకాలుగా ఉన్నా ప్రభావం చూసిస్తున్నది మాత్రం సగటు జీవరాశి మీదే అన్న సంగతి చెప్పనవసనం లేదు. ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఏకంగా ప్రపంచదేశాలన్ని ఒక్క తాటి మీదకు వచ్చి వేడెక్కిన భూగోళాన్ని 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇకపోతే తాజాగా యునివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఎపిక్‌) చేపట్టిన కాలుష్యం ప్రభావం సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలను 2.5 పర్టికులేట్‌ మాటర్‌లో పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు. ఈ జాబితాలో అత్యంత కాలుష్య ప్రభావ దేశంగా భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నేపాల్‌ దేశం ఉన్నట్లు సర్వే పేర్కొంది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సూచించిన పరిధి మేరకు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఒకరకంగా భారతదేశం విఫలమైందని సర్వేలో బహిర్గతమైంది.


ఇక ఈ కాలూష్యాంవల్ల  దేశ జనాభాలో 40శాతం మంది ప్రజలకు వారి ఆయుష్‌లో ఏడేళ్లు తగ్గిందని. 2013-17 శాంపిల్‌ సర్వే ప్రకారం భారతదేశం ఆయుర్దాయం  67 ఏళ్ల నుంచి 69 ఏళ్లకు పెరిగినా కాలుష్య ప్రభావంతో అది ఏడేళ్లకు తగ్గి 60 నుంచి 62 ఏళ్ల దగ్గర ఆగిపోయిందని పేర్కొంది.. ఇదేకాకుండా 1998కి ముందు ఇంత కాలుష్యం లేదని, 1998-2016 మధ్యలో 72 శాతం మేర కాలుష్యం పెరిగిందని తమ అధ్యయనంలో నివేదించింది. ఈ పరిస్దితులు ఇలాగే కొనసాగితే మాత్రం మనిషుల్లో మరణాలు అధికంగా సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


ఇప్పటికైనా మేధావులు అని చెప్పుకునే మానవులు కళ్లు తెరిచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన (10మైగ్రా.మీటర్‌ క్యూబ్‌)  ప్రమాణాలు పాటిస్తే కొంతమేర ప్రభావం తగ్గి భారతదేశంలో 4.3 సంవత్సరాల ఆయుషు పెరిగే అవకాశం ఉందని  తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇక కాలుష్యనివారణ చర్యలు చేపట్టి కచ్చితంగా అమలు చేస్తే సగటు భారతీయుడు ఆయురార్ధం 1.3, ప్రభావితమైన ఏడు రాష్ట్రాల్లో 2ఏళ్లకు పెరుగుతుందని నివేదికలో వెల్లడించింది. చూసారా మనిషి సుఖాలు పొందుతూనే మరణానికి చేరువవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: