సమాజంలో రోజురోజుకు మహిళలకు భద్రత కరువవుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్లు  ఆడపిల్లలపై పడి బతుకులను చింద్రం  చేస్తున్నారు. నెలలు నిండని పసికందు నుంచి పండు ముసలి వరకు అందరిపై కామపిశాచుల్లా పడిపోతున్నారు. ఆడపిల్ల కాలు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వావివరుసలు మరచి... చిన్నా పెద్దా తేడా లేకుండా కామ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలకు తమ  రక్షణ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎన్నో కుటుంబాల్లో  విషాదాన్ని నింపాయి. ఇలా రోజుకో ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ కూడా అత్యాచారాలు  ఆగడం లేదు.



 చెల్లి పిన్ని అత్తమ్మ అమ్మ బామ్మ ఇలా వావివరసలు లేకుండా వక్ర  బుద్ధితో కామవాంచ తీర్చుకోవడానికి మీద పడి పోతున్నారు. రోడ్డుపై ఉండే ఆకతాయిల నుండే కాదు ... మహిళలకు ఇంట్లో ఉన్న వారి నుంచి కూడా లైంగిక వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బయట ఉండే కామ మృగాల నుండి  మహిళలకు ఆత్మరక్షణ లేదు అనుకుంటున్న తరుణంలో... ఇంట్లో వాళ్ల నుంచి కూడా లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న ఘటనలో రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. సొంత  కుటుంబీకులే కామపిశాచి లాగా మారి... లైంగిక వేధింపులు జరుపుతుంటే బతకాలా చావాలా అనే పరిస్థితుల్లో ప్రస్తుతం మహిళలు బతుకుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా  తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది . కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఇప్పుడు తాజా ఘటన చోటు చేసుకుంది. 



 కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సమీపంలో ఒక గ్రామానికి చెందిన బాలికపై అన్నయ్య వరుస అయ్యే యువకుడు అత్యాచారం  చేయడంతో బాలిక గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 13 ఏళ్ల బాలికపై అన్నయ్య వరుస అయ్యే  పెద్దమ్మ కొడుకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే 6 నెల కావడంతో అబార్షన్ చేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో... సదరు బాధిత బాలికను ఐసిడిఎస్ సంరక్షణలో ఉంచారు. గర్భంతో ఉన్న 13 ఏళ్ల బాలిక  9 నెలలు నిండడం తో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చెయ్యగా...  ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ బాలిక. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వావి వరసలు మరిచి అన్న వరస అయ్యే యువకుడు చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు .నిందితుడిపై  పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: