క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. 288 సీట్లున్నఅసెంబ్లీలో ఏ పార్టీకి కానీ కూటమికి కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోవటమే ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రధాన కారణం. మొన్నటి ఎన్నికల్లో బిజెపి-శివసేన ఓ జట్టుగాను కాంగ్రెస్—ఎస్సీపి పొత్తులతో పోటి చేశాయి.

 

అయితే బిజెపి+శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 149 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఉండితీరాలి. బిజెపి 105 సీట్లు గెలవగా శివసేన 56 సీట్లు గెలిచింది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యకన్నా కేవలం 12 సీట్లు మాత్రమే అధికంగా ఉంది.

 

ఈ సంఖ్యతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా ముఖ్యమంత్రి పదవి కోసం రెండు పార్టీలు పట్టుబట్టడంతో  పొత్తు విచ్చినమయ్యే పరిస్ధితి దాపురించింది. అదే సమయంలో ఎన్సీపికి 54 సీట్లు, కాంగ్రెస్ కు 44 సీట్లొచ్చాయి. మిగిలిన చోట్ల కొందరు స్వతంత్రులు, చిన్నా చితక పార్టీల అభ్యర్ధులు కూడా గెలిచారు.

 

శివసేన గనుక ఎన్సీపి, కాంగ్రెస్ తో కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు కానీ అపుడు బిజెపి చూస్తు ఊరుకోదు కదా ? పైగా అతుకుల బొంతలాంటి ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఈ పరిస్ధితుల్లో బిజెపి, శివసేనల్లో సిఎం పీఠం విషయంలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గకపోతే మార్గమేంటి ? ఏమిటంటే రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదు.

 

కొంత కాలం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు అవకాశం ఉంది. ఈలోగా శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ తో సహా మిగిలిన ఎంఎల్ఏల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకోవాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. అంటే తనకు దక్కని సిఎం పోస్టును మరెవరికీ దక్కనీయకూడదన్నదే బిజెపి ఆలోచన. అందుకు తగ్గట్లే రాష్ట్రపతి పాలన పెట్టి అనుకున్నది సాధించాలని బిజెపి ఆలోచిస్తోందని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: