హైదరాబాద్‌లో వాయు కాలుష్యం రోజు రోజుకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో రాజధాని వాసుల్లో  టెన్షన్ నెలకొంది. ఇప్పటికి గ్రేటర్ హైదరాబాద్ లో, ఎక్కువగా కాలం చెల్లిన ద్విచక్ర వాహనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో నగరవాసులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు.


జంటనగరాలలో తిరుగుతున్న వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని అంచనా వేయగా ప్రమాదభరితంగా ప్రతీరోజు 15 వందల టన్నుల కాలుష్యం విడుదల చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు..ఇకపోతే గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటితే చాలా ప్రమాదకరం అలాంటిది నగరంలో 720 ఏక్యూఐ వద్ద 2.5 పీఎం వాయుకాలూష్య త్రీవత నమోదు చేయబడింది.


దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నవారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గి అనారోగ్యాలతో బాధపడే వారితో నగరం నిండిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్యనిపుణులు. నగరంలోకి ఎక్కడెక్కడినుండో జనాలు బ్రతుకు దెరువు కోసం వలస వస్తారు, వీరితో పాటు ఎన్నో వాహనాలు వారి సౌలభ్యంకోసం వెంట తెచ్చుకుంటారు.


ఇవే కాకుండా ప్రతి ఇంటిలో మూడూ లేదా నాలుగు వాహనలుండటం, ఇంకా ఆర్దికంగా ఉన్నవారైతే ఆ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని వాహనాలు వాడటం, ఇదే కాకుండా నగరంలోకి నిత్యం ఎన్నో వాహనాలు వివిధ రాష్ట్రాలనుండి ప్రయాణాలు కొనసాగించడంతో ఎయిర్‌ పోల్యూషన్ పెరిగి, శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెజబ్బులు, చర్మానికి సంబంధించిన అలర్జీ వంటి వ్యాధులు ఎక్కువగా నగరవాసులను బాధిస్తున్నాయని తేలింది.


ఇకపోతే ఇప్పటికే ఢిల్లో వాయుకాలూష్యం వల్ల అక్కడి ప్రజల జీవనం ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఢిల్లీ తో పోటీపడుతుంది. అందుకు నిదర్శనగా గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం వాయుకాలూష్యంలో ప్రమాదకర రసాయానాల స్దాయి పెరిగిపోయిందని పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైన అధికంగా పొగను వదిలే వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే నగర జీవనం ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: