తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 27 రోజులకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం పై మొగ్గు చూపలేదు. అయితే మొదటి నుంచి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తానంటూ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగాల  నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో.... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తర్వాత టిఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ సమ్మె ముగింపు ఏం లేదని... టిఆర్ఎస్ సంస్థ  ముగింపు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కార్మికులు చేస్తున్న సమ్మె ఒక పనికిమాలిన పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 




 ఇక ఈ పనికిమాలిన సమ్మెకు బిజెపి పార్టీ  మద్దతు తెలుపుతుందని... దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ద్వారానే తాము ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ కెసిఆర్ బిజెపి ని విమర్శించారు. పార్టీకి చెందిన ప్రధాన మంత్రి చట్టాన్ని తీసుకువస్తే అదే తప్పు అంటూ మళ్ళీ బిజెపి నాయకులు నిరసనలు తెలుపుతున్నారు అంటూ ఆరోపించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ లో తన సొంత నిర్ణయం తీసుకోలేదని దేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన చట్టం ప్రకారమే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో స్పందించిన బిజెపి నేతలు కార్మికుల క డిమాండ్ పరిష్కరించడం ఇష్టంలేక కేసీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ గవర్నర్ తమిళ సై కేంద్రానికి నివేదిక అందించడం కూడా జరుగింది. ఇక తాజాగా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలంటూ నిరసన తెలుపుతున్న బిజెపి ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు దాడి చేయడం సంచలనంగా మారింది. 



 కాగా నేడు  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ బిజెపి ఢిల్లీ బయల్దేరారు. బీజేపీ  జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ను కలవడంతో పాటు బీజేపీ పెద్దలను కాలవ నున్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై కేంద్రానికి నివేదిక అందించనున్నారు  తెలంగాణ బిజెపి అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్టీసీ సమ్మె జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుంది. అయితే  బిజెపి పెద్దలతో సమావేశం కానున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్... తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రవేశపెట్టిన చట్టం తోని ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ విమర్శిస్తున్న అంశాన్ని, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల అంశాన్ని... అంతేకాకుండా ఎంపీ సంజయ్ పై పోలీసుల దాడిని బిజెపి పెద్దలతో చర్చించనున్నారు. మరి ఆర్టీసి సమ్మె పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: