మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో  బిజెపి శివసేన కూటమి మాజీ స్పీకర్ ను దాటేసినప్పటికి... మహారాష్ట్రలో ప్రభుత్వం మాత్రం ఏర్పాటు కాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన  పార్టీకి చెందిన నాయకులు రెండున్నర సంవత్సరాల పాటు సీఎం పదవి కట్టబెట్టాలని బిజెపిని కోరడంతో బిజెపి దానికి అంగీకరించలేదు. 50-50 ఫార్ములాకు బిజెపి అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోజురోజుకు మహారాష్ట్ర రాజకీయాల్లో  ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 53 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న  ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠకు దారితీసింది. 



 ఈ నేపథ్యంలో బీజేపీ శివసేన కూటమి కాకుండా శివసేన ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. శివసేన తమ పార్టీ నాయకుడిని రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసి తీరాలని పట్టుబట్టడంతో బీజేపీని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి . తమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని... ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేలను సమీకరించుకుంటామని  ఎంపీ సంజయ్ రౌత్  తెలపడంతో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో అసలు మహారాష్ట్రలో ఏం జరగబోతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. 



 కాగా ఇప్పటికే శివసేన అధినేత థాక్రే శరత్ పవార్ తో చర్చలు జరిపిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన అంతరంగాన్ని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో...  దానికి మేము  కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు ఎన్సీపీ ప్రతిపక్షంగా ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారని వారి అభీష్టం మేరకే తాము ప్రతిపక్ష స్థానంలోనే కొనసాగుతని  శరత్ పవార్ తెలిపారు. అయితే ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా  అనే ప్రశ్న తలెత్తగా ... ఆ దిశగా తమ పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్ర ప్రజలందరూ మరోసారి బిజెపి శివసేన ప్రభుత్వమే కావాలని వారికి భారీ మెజారిటీ స్థానాలు కట్టబెట్టారని కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది వారిద్దరు చిన్నపిల్లల వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కాగా రోజురోజుకు మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నవేళా...  చివరికి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: