ఈ మధ్య సైబర్ క్రైంలు మరి ఎక్కువ అయిపోయాయి. ఫోన్ లో మ్స్గ్ చుసిన డబ్బులు కట్ అవుతాయి.. కాల్ లిఫ్ట్ చేసిన కట్ అవుతాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషి పని ఎంత తగ్గిస్తుందో అంతే డబ్బులు కూడా పోయేలా చేస్తుంది ఈ టెక్నాలజీ. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలో డబ్బులు ఎగిరిపోయాయి. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పున్నారావు అనే వ్యక్తి ఓ ప్రైవేటు ఉద్యోగి. అయితే అతని బ్యాంకు ఖాతా నుంచి ఒక రూపాయి డెబిట్ అయినట్టు శుక్రవారం ఆయన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. దీంతో ఎందుకలా అయ్యిందని చూస్తున్న సమయంలో ఒక నంబరు నుంచి అతనికి మిస్డ్‌కాల్‌ వచ్చింది.


తర్వాత అదే నంబరు నుంచి ఫోన్‌ అతనికి వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చెయ్యగనే అచ్చం కస్టమర్ కేర్ లా 'మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. హిందీలో సమాచారం తెలుసుకోవాలంటే 1, ఇంగ్లిషులో అయితే 2, తెలుగులో కావాలంటే 5 నొక్కండి' అని ఓ అమ్మాయి గొంతు వినిపించింది. 


దీంతో తెలుగు కోసం ఆ పున్నారావు 5 నొక్కారు. అంతే.. ఆయన ఖాతాలో ఉండాల్సిన రూ.14 వేలు కట్‌ అయినట్లు మెసెజ్ వచ్చింది. దీంతో బాధితుడు వెంటనే తన బ్యాంకుకు వెళ్లి సమాచారం అందించాడు. దీంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆయన ఏటీఎం కార్డును బ్లాక్‌ చేశారు.


అందుకే.. రేడియోల నుంచి సెల్ ఫోన్ లోని పేస్ బుక్ వరుకు ప్రతి ఒక్కరికి మీ పిన్ నెంబర్ చెప్పకండి, సీవీవీ చెప్పకండి అని చెప్తుంటారు. కానీ ఎవరు వినారు. ఓ మెసేజీ వచ్చిందంటే చాలు ఫస్ట్ అది చూడాలి.. అందులో ఎం ఉంటె అది నొక్కేయాలి.. ఫోన్ చేస్తే చెప్పేయాలి అని అనుకుంటారు. కానీ ఆలా చెయ్యడం వల్ల ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోతారు సైబర్ నేరగాళ్లు. అందుకే జెర జాగ్రత్తగా ఉండండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: