ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేతిలోకి వచ్చిన సమయం నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నాడు. 

              

అయితే ఈ నిర్ణయానికి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫిదా అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విజయవాడలో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్ విజయం సాధించారని అభినందించారు. 

             

కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందని, ఆర్టీసీ ని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని అయన అన్నారు. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రైవేట్ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడపరని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు. 

               

అయితే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్‌ చాలా గొప్పది అని కేశినేని నాని అన్నారు. మంచి పని చేశారని తనకు అనిపించింది కాబట్టే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని కుటుంబం కార్మిక పక్షపాతి అని ప్రశంసించారు. 

             

అయితే టీడీపీకి అధికారం పోయినప్పటి నుండి.. అందరి నాయకుల్లా మనసు చంపుకొని ఆ పార్టీలో ఉండలేక.. పార్టీ నుండి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కేశినేని నాని నిర్ణయం ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: