పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో  ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత నేపథ్యంలో  లాంగ్ మార్చ్ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. గతంలో టాలీవుడ్ పవర్ స్టార్ గా ఉన్న  పవన్ కళ్యాణ్ సినిమాల్లో  బాగానే రాణించారు. ఏ హీరోకు లేనంత స్టార్డం సంపాదించుకుని... టాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఉన్నట్టుండి జనసేవ చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి జనం లోకి వెళ్లారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనం లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే సినిమాల్లో  బాగా ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చి గట్టిగా రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తారని అందరూ భావించారు. అటు పవన్ కళ్యాణ్ తీరు చూసిన అందరికీ అదే అనిపించింది. ఏకంగా దేశ ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపే సరికి జనసేనానీ పై  అంచనాలు  ఇంకా ఎక్కువ అయిపోయాయి. 

 

 

 

 అయితే 2014 ముందే జనసేన పార్టీ వచ్చినప్పటికీ 2014 ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేయలేదు. 2014 లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి మద్దతు ప్రకటించింది జనసేన పార్టీ. ఇక తాజాగా ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. అయితే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లి... ప్రజలను బాగానే ప్రభావితం చేసింది. ఈసారి టీడీపీ కి మద్దతుగా కాకుండా ఒంటరిగా పోటీ చేసింది జనసేన. ఎంతోమంది పెద్దపెద్ద నాయకులు సైతం జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పెద్ద పార్టీ అవతరిస్తుందని అందరూ భావించారు. పవన్ రాజకీయాల్లో దున్నేస్తారు  అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది జనసేన పార్టీ. మెజారిటీ సీట్లు కాదు కదా కనీసం జనసేనని కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

 గత ఎన్నికల్లో ఏకంగా జనసేన ని సైతం ఓటమి పాలవగా జనసేన పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది . ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పని అయిపోయిందని... పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లాల్సిందే అంటూ అందరూ భావించారు. అయితే అటు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన లోనే ఉంటా అని సినిమాల వైపు వెళ్లను  తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో   ఆంధ్ర రాజకీయాల్లో  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కథ ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ జనసేనని  పట్టు వదలటం  లేదు. ప్రజల తరఫున ఏదో ఒక అంశంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా  దీని పై కూడా రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఉని కోసమే పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారా అని కొందరు భావిస్తున్నారట. తాము  కూడా ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నామని ప్రజలకు గుర్తు చేయడానికి పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ పై విమర్శలు చేస్తూ ఉన్నారా...ఈ  నేపథ్యంలోనే పవన్ లాంగ్ మార్చ్  తల పెట్టారా అంటూ  రాజకీయ వర్గాల్లో కొంతమంది భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: