రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య గత  కొంత కాలంగా భవన నిర్మాణ రంగ కార్మికులను  బాధిస్తోంది. కానీ అంతకంటే ముందు నుంచి భవన నిర్మాణ కార్మికులు మరో సమస్యతో బాధపడుతున్నారు. ఒక్క  భవన నిర్మాణ కార్మికులే  కాదు పేద ప్రజలు రోజువారి కూలీలు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యే 5 రూపాయల భోజనం. గతంలో టీడీపీ  ప్రభుత్వ హాయంలో అన్న క్యాంటీన్ లను ఏర్పాటుచేసి 5రూపాయలకి పేద ప్రజలకు భోజనం పెట్టింది టిడిపి ప్రభుత్వం. ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ లన్నిటిని మూసివేయించారు. ఈ పథకంలో గోల్మాల్ జరిగిందని భారీ స్కాం జరిగిందంటూ ఆరోపణలతో అన్న క్యాంటీన్ లను  రాష్ట్రవ్యాప్తంగా మూసివేయించారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ల తో ఎంతో మంది పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు కూలీలకు ఐదు రూపాయలకే కడుపునిండా భోజనం దొరికేది. 

 

 

 

 కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటిన్లు   అన్నిటిని వైసీపీ ప్రభుత్వం మూసివేయడంతో. కార్మికులందరికీ 5 రూపాయల భోజనం లేకుండా పోయింది.దీంతో  కార్మికులందరికీ భోజనాలకు నెలకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అయితే ఉదయాన్నే కూలి పనులకు వెళ్లే కార్మికులు... ఉదయాన్నే వంట తీసుకుని వెంట బాక్స్ తీసుకెళ్లాల్సిన పని లేదు మధ్యాహ్నం  సమయనికి  అన్న కాంటీన్ లా  దగ్గరకి  వచ్చి వేడి వేడి అన్నం పప్పు తినేవారు కార్మికులు. కానీ ప్రస్తుతం అన్న క్యాంటీన్ లని మూసివేయడంతో వాళ్ళకి ఆ సౌలభ్యం కరువైపోయింది. దానికి తోడు రాష్ట్రంలో ఇసుక కొరత కూడా ఏర్పడడంతో ఉపాధిలేక చేతిలో డబ్బులు లేక కనీసం తిండి కి  కూడా డబ్బులు వెచ్చించి లేని పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. దీనికి తోడు అన్న క్యాంటీన్లు కూడా మూసివేయటంతో... తిండికి ఎక్కువ డబ్బులు వెచ్చించలేక పస్తులుంటున్నారు  . 

 

 

 

 అసలు అన్న క్యాంటిన్లు మూసివేయడానికి కారణం ఏంటి అంటే. టిడిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పేరుతో 150 కోట్ల స్కాం కి పాల్పడిందని  వైసీపీ ఆరోపణ.  ప్రజలను ప్రలోభపెట్టేందుకే  టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు అన్న క్యాంటీన్ల నిర్వహించిందని... ఈ అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కామ్  జరిగిందని అప్పట్లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించిన  విషయం తెలిసిందే. 2 లక్షలతో నిర్మించే క్యాంటీన్లకు  30 నుంచి 50 లక్షలు ఎలా ఖర్చయిందంటూ  విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.ఇదిలా ఉండగా  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి నుంచి రాజన్న క్యాంటీన్ ల పేరుతో 5 రూపాయల భోజనం  పథకం ఏర్పాటు చేయాలి  అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.. కానీ దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా 5 రూపాయల భోజనం విషయంలో వైసీపీ కంటే టీడీపీ యే మేలు అని కార్మికులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: