కూతురుని చేసుకోబోయే వాడు అల్లుడు. ఆ అల్లుడిపైనే మనసుపడింది ఓ అత్త. ఇది సమాజం తలదించుకొనే విషయం. కూతురి భవిష్యత్తుకోసం ఆలోచించే ఏ తల్లి ఇలాగా ప్రవర్తించదు. తన సుఖాన్ని ధారపోసైన తన బిడ్డ సంతోషంగా ఉండాలని, ఆమె అత్తవారింట్లో ఆనందంగా బ్రతకాలని ఆలోచిస్తుంది. అలాంటి సమాజంలో కొందరు ఆడవాళ్లు, మగవాళ్లు కోరికల చెదలును వదిలించుకోలేక, కట్టుబాట్లను, సంస్కారాన్ని మరచి తుచ్చమైన దేహం కోసం అది అందించే క్షణికమై సుఖం కోసం మానవతా విలువలను మంటగలుపుతున్నారు. నాడు విలువగా జీవించిన మనిషి, నేడు విలువలేకుండా చేసుకుంటున్నాడు.


ఒంట్లో రగిలే కామాన్ని జయించలేక అడ్డమైన దార్లు ఎంచుకుని అవి తీర్చుకుంటున్నాడు. తల్లి, కూతురు, అన్నా, చెల్లి అనే బంధాలను అటకమీద పెట్టి శృంగార లోకంలో విచ్చలవిడిగా ఊరేగుతున్నారు. ఇక్కడ ఒక తల్లి తన శరీరవాంఛ కోసం కాబోయే అల్లుడితో సంబంధం పెట్టుకుని నలుగురిలో నవ్వులపాలు అయ్యింది. వివరాలు తెలుసుకుంటే జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఘటనలో కూతురే తల్లిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పరువుతీసింది.. జంషెడ్‌పూర్‌ పోలీసుల కథనం ప్రకారం..


భర్త చనిపోయిన ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. కాగా డిగ్రీ చదువుతున్న ఆమె కూతురూ ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయం ఇంట్లో చెప్పగా  ఆమ్మాయి తల్లి వారి పెళ్లికి అంగీకరించింది. ఇక వీరిద్దరి పెళ్లికి లైన్ క్లియర్ కావడంతో యువకుడు తరచూ ఆ అమ్మాయి యింటికి వస్తున్నాడు.అలా క్రమక్రమంగా  అమ్మాయి తల్లితో పెరిగిన చనువు ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో  కాబోయే అల్లుడితో వీలు చిక్కినప్పుడలా సర్వ సుఖాలు అనుభవించడం మొదలుపెట్టింది.


ఒకానొక సమయంలో ప్రియుడు ఇంటికి వచ్చి పోతుండడాన్ని గమనించిన ఆ యువతి అతడిపై నిఘా పెట్టింది. ఇలాంటి దశలో ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి కొచ్చిన ఆమెకు బయట తనకు కాబోయే వాడి చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చిన ఆ యువతి లోపలికి తొంగిచూస్తే తన తల్లితో , ప్రియుడు సన్నిహితంగా ఉండటం కనిపించిది.. దీంతో విస్తుపోయిన ఆమె..


ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు స్థానికులను అప్రమత్తం చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతైన తన తల్లికదా అని చూస్తూ ఊరుకోకుండా ఆమె చేసిన పనికి స్దానికులు ఆమెను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: