ఆదివారం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విశాఖపట్నంలో జనసేన పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఇసుక కొరత వల్ల నిర్మాణాలు నిలిచి పోయాయి. దీంతో భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ అంశాన్ని హైలెట్ చేయడం కోసం ఆదివారం లాంగ్ మార్చ్ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.


ఇకపోతే ఈ ఇసుక కొరత నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ కూడా దీక్ష చేపట్టారు. ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు దీక్షకు దిగి. సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్ ఈ దీక్ష విరమించారన్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిర్వహించే ఈ ఈ లాంగ్ మార్చ్ కు వామ‌ప‌క్షాలు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్ లాంగ్ మార్చ్ కు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము ప్రత్యక్షంగా పాల్గొన‌లేమ‌ని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి.


ఈ మేర‌కు సీపీఐ, సీపీఎం పార్టీలు సంయుక్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఓ లేఖ‌ను కూడా రాశాయి. అయితే ఇలాంటి సమయంలో  జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.. విశాఖలో ఆదివారం లాంగ్ మార్చ్ జరగనుండగా. జనసేన కీలకనేత పసుపులేటి బాలరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు. ఎన్నికలకు ముందు పవన్ సమక్షంలో బాల రాజు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.


ఇక పసుపులేటి బాలరాజు పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలవ్వగా. ఇదే నియోజక వర్గం నుండి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు ముగిసిన తరువాత జనసేనకు చెందిన పలువురు నేతలు రాజీనామాలు చేసి వైసీపీలో చేరుతున్నారు. ఇకపోతే రాజీనామా అనంతరం బాలరాజు ఏ పార్టీలో చేరతారనేది స్పష్టం కాలేదు. వైసీపీలో చేరే అవకాశముందని ఆయన అనుచరులు చెబుతుండగా. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై  పసుపులేటి బాలరాజు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: