ఏపీలో ప్ర‌స్తుతం భ‌వ‌న్ నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇసుక లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌నిలేక రోజు గ‌డ‌వ‌డం కూడా చాలా ఇబ్బందిగా మార‌డంతో కొంద‌రు కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ మార్చ్ పేరుతో విశాఖలో ఆదివారం భారీ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టారు. విశాఖలో మార్చ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. రోజు గ‌డ‌వ‌డం కూడా క‌ష్ట‌మ‌వ‌డంతో ఏపీ భ‌వ‌న్ నిర్మాణ కార్మికులు జ‌గ‌న్ పై మండిప‌డుతున్నారు.  ఇసుక సంక్షోభం పై జ‌న‌సేన స‌మ‌ర‌శంఖం మోగించ‌నుంది. భ‌వ‌న నిర్మాణ కూలీల‌కు అండ‌గా నిల‌బ‌డ‌నున్నారు జ‌న సైనికులు. ఏపీలో పాత ఉచిత ఇసుక ర‌ద్దు చేసి. ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మ‌కాల‌ను చేప‌ట్టి ఇసుక స‌ప్లై విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం చేతుల ఎత్తేయ‌డంతో దాదాపు 30 లక్ష‌ల మంది కార్మికులు రోడ్డున‌ప‌డ్డారని మండిప‌డుతున్నారు. ఈ లాంగ్ మార్చ్‌కు టిడిపి  మ‌ద్ధ‌తు తెలిపింది. లాంగ్‌మార్చ్‌లో సీనియ‌ర్‌నేత‌బ అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీ‌నివాస్‌రావ్ త‌దిత‌రులు హాజ‌ర‌వుతున్నారు. ఇసుక పై  తామే అస‌లైన పోరాటం చూస్తున్నామంటున్న బిజెపి లాంగ్ మార్చ్‌కి సంఘీభావం తెలిపింది. లాంగ్‌మార్చ్‌కి లెఫ్ట్ పార్టీ నేత‌లు మాత్రం మాట మార్చాయి.


 లాంగ్ మార్చ్‌ని విజ‌య‌వంతం చేసేందుకు పార్టీ నేత‌లంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. వైజాగ్ మ‌హిళా జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఏర్పాట్ల‌న్నీ ముమ్మ‌రంగా సాగుతుండ‌గా.  ఇది కేవ‌లం ప్ర‌భుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల‌న్న ఉద్దేశంతో చేస్తున్నాం కానీ దీనికి అడుగడుగున అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయ‌ని పార్టీ నేత‌లు కొంద‌రు వాపోతున్నారు. రాత్రి వ‌ర‌కు స‌భ నిర్మాణ ప్రాంగ‌ణానికి  కూడా అనుమ‌తి ఇవ్వ‌ని ప‌క్షంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు వైజాగ్‌కు చేరుకోనున్నారు. జ‌న‌సేనాని మూడు గంట‌ల‌కు మ‌ద్దెల‌పాలెం నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం కానుంది.  బిజెపిని పిల‌వ‌డం వ‌ల్ల లెఫ్ట్ పార్టీలు ఈ కార్య‌క్ర‌మానికి పాల్గొన‌మ‌ని స్ప‌ష్టం చేశాయి. లోక్‌స‌త్తా పార్టీ కూడ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. జ‌న‌సేన కార్మికులు ఆంధ్రాయూనివ‌ర్సిటీ గేటును నెట్టుకుంటూ లోనికిరావ‌డంతో  అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొనింది.

ఆంధ్రాయూనివ‌ర్సిటీ మెయిన్ గేటును మూసివేశారు. దీనికి నిర‌స‌న‌గా కొంద‌రు కార్య క‌ర్త‌లు పెద్ద ఎత్తున గేట్లును నెట్టుకుంటూ లోనికి వెళుతున్నారు. ఈ ఆంధ్రాయూనివ‌ర్సిటీలో ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చే కార్మికుల‌కు భోజ‌నాలు పార్కింగ్ వ‌స‌తులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ రేపు ఇంజ‌నీరింగ్ కాలేజ్‌లో ప‌రీక్ష‌లు ఉన్నందువ‌ల్ల గేట్లు మూసివెయ్య‌డం జ‌రుగుతుంద‌ని యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం తెలుపుతుంది. దీంతో అక్క‌డ ఉద్రిక‌త్త‌త ప‌రిస్థితి నెల‌కొనింది. ఆఖ‌రి నిముషంలో గేట్లు మూసివేసిన ఆంధ్రా యూనివ‌ర్సిటీ ప్ర‌సాద్‌రెడ్డి స‌మాధానం చెప్ప‌వ‌ల‌సిందిగా కోరుతున్నారు. ఆయ‌న ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారాని కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తులో నినాదాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: