ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రోజురోజుకు ఇసుక కొరత  సమస్య ఎక్కువవడంతో  భవన  నిర్మాణ కార్మికులు అందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస ఉపాధి కరువై  భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు భవన  నిర్మాణ కార్మికులు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు .ఈ క్రమంలో  రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడి నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైందని... విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ నేపథ్యంలో పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి  ప్రతిపక్ష పార్టీలు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్ కు  పిలుపునిచ్చారు.

 

 

 

 రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను పరిష్కరించడం తో పాటు భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని లాంగ్ మార్చ్ నిర్వహించారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాగా  ఈ లాంగ్ మార్చ్ కి  అన్ని పార్టీల మద్దతు కూడా కోరారు పవన్. అయితే నేడు విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీంతో లాంగ్ మార్చ్ మొత్తం జనసందోహంగా  మారిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కి  టీడీపీ నుంచి ముఖ్య నేతలైన అయ్యన్నపాత్రుడు,  మాజీమంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు,  ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా  లాంగ్ మార్చ్ బీజేపీ కూడా మద్దతు తెలిపింది.

 

 

 

 అయితే ఈ లాంగ్ మార్చ్ కి  బీజేపీ ఆహ్వానించడం  కారణంగా  ఈ లాంగ్ మార్చ్ కి  లెఫ్ట్ పార్టీలు దూరంగా ఉన్నాయి. అంతేకాకుండా భారీ సంఖ్యలో జనం కూడా ఈ లాంగ్ మార్చ్ ki తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్  కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా విశాఖలో జరుగుతున్న జనసేన లాంగ్ మార్చ్ సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీకేడ్లలో   విద్యుత్ ప్రవహించడం తో పలువురు కార్యకర్తలకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో  పలువురికి గాయాలవ్వగా...  వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కాగా  ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది జనరేటర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో నేతల ప్రసంగానికి అంతరాయం ఏర్పడినట్లు అయింది.అయితే కరెంట్ షాక్ తో అక్కడికి చేరుకున్న జనాల మధ్య తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన నేతలు కార్యకర్తలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: