ఈ మధ్యకాలంలో మానవతప్పిదాల వల్లనో లేక టెక్నికల్ ప్రాబ్లం వల్లనో తెలియదు కాని రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి కాని అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగడం లేదు. కాని అనుకోకుండ జరిగే రైలు ప్రయాణాలలో ఏదైన ప్రమాదం పెద్దగా సంభవిస్తే పోయే ప్రాణాలకు భాధ్యత ఎవరు వహిస్తారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మొన్న జరిగిన రైలు ప్రమాదంలో 70 మంది వరకు ప్రయాణికులు మరణించారు.


ఇవే కాకుండా రైలు పట్టాలు విరగడం. రైలు భోగిల లింకులు తెగిపోవడం తరచుగా సంభవిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాల విషయంలో తగినంత అప్రమత్తంగా రైల్వే అధికారులు ఎందుకు ఉండటం లేదో అర్ధం కావడం లేదు. ఇకపోతే తాజాగా మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రేస్‌కు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు  తృటిలో ప్రమాదం తప్పింది.


ఖుర్దా జిల్లాలోని బాలుగావ్ స్టేషన్ సమీపంలో ఇంజిన్ నుంచి రైలు బోగీలు విడిపోయాయి. రైలు ఇంజిన్ అలాగే కొద్ది దూరం ముందుకు వెళ్లిపోయింది. బోగీలు విడిపోయాయని గ్రహించిన లోకో పైలెట్లు ఇంజిన్‌ను నిలిపివేసి.. మెయింటెనెన్స్ టీమ్‌కు సమాచారం అందించారు. దాదాపు గంట తర్వాత మరమ్మతులు చేశాక రైలు తిరిగి బయలులేరి వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.


బోగీలు విడిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కాని స్పీడ్‌గా వెళ్లే రైలు భోగిలు అలా విడిపోవడం వల్ల ఏదైన జరిగితే కలిగే ప్రాణ నష్టం ఊహించని విధంగా ఉండేదేమో ఇప్పటికే రైల్వే పైన ప్రయాణికులు కొంతవరకు అసంతృప్తిగా  ఉన్నారు ఇకపోతే ఇలా జరిగే ప్రమాదాల విషయంలో వారు మరింత అసహనం ప్రదర్శిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: