టీమ్ ఇండియా వైస్ క్యాప్టెన్ శర్మ... ఈ పేరు వినగానే సగటు క్రికెట్ ప్రేక్షకుడికి గుర్తొచ్చేది సిక్సుల వర్షం. బ్యాట్  పట్టి మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే పరుగుల వరద పారించేస్తాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ జుళిపిస్తే  సిక్సుల వర్షం కురవాల్సిందే.  అందుకే క్రికెట్ లో  రోహిత్ శర్మకు  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా నే కాకుండా... ఇండియా టీం లో ఒక మెయిన్ బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ తన హవా నడిపిస్తున్నాడు. రోహిత్ శర్మ తన బ్యాట్ జులిపించి  ఎన్నో మ్యాచుల్లో  టీమిండియాను విజయ తీరాల వైపు నడిపించాడు. ఇక తాజాగా జరిగిన ప్రపంచ కప్ లో కూడా టీమిండియా నీ విజయపు అంచుల వరకు ఒంటిచేత్తో తీసుకెళ్లాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ బ్యాట్ పడితే బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టక మానదు. 

 

 

 

 సొగసైన షాట్లతో ... ఇంపైన బౌండరీలతో క్రికెట్ అభికనులు  అందరికీ ఒకింత ఎక్కువే క్రికెట్ మజా పంచుతాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ బ్యాట్ పడితే బాల్  మొత్తంగా గాల్లోనే  తేలుతుంది. అందుకే రోహిత్ శర్మ  హిట్ మాన్ గా పేరొందాడు. మైదానంలో అడుగు పెట్టినప్పటి నుంచీ బాదుడే బాదుడు. అంతేకాకుండా రోహిత్ శర్మ డబుల్ సెంచరీల  వీరుడు అంటూ మరో పేరు కూడా ఉంది. అలవోకగా డబుల్ సెంచరీలు సైతం పూర్తి చేయగల గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం రోహిత్ శర్మ సొంతం. సాటి  బ్యాట్స్మెన్ లకు సైతం రోహిత్ శర్మ ఇన్స్పిరేషన్ గా నిలిస్తుంటాడు . ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ కి క్రికెట్ అభిమానులు అందరూ ఫిదా అయిపోతుంటారు . 

 

 

 

 ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ తాజాగా  మరో సరికొత్త రికార్డును సృష్టించారు. ఈరోజు బంగ్లాదేశ్ తో  జరిగిన టీ20 మ్యాచ్లో అరుదైన రికార్డును బ్రేక్ చేసేసాడు హిట్ మ్యాన్ రోహిత్ . టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు ఖాతాలో రెండో ప్లేస్లో ఉన్నాడు  రోహిత్ శర్మ. మొదటి ప్లేస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ లో రోహిత్ శర్మ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఇప్పటికే 2450 పరుగులతో కోహ్లి మొదటి స్థానంలో ఉండగా.. 2443 పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నారు. ఇక తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్ లో చేసిన తొమ్మిది పరుగులతో రోహిత్ శర్మ టి20 మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. ఇటు టీమిండియా తరఫున ఎక్కువ టి20 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ సరికొత్త రికార్డును సృష్టించాడు. 98 టి20 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా ధోని ధోనితో సమానంగా ఉన్న హిట్ మ్యాన్ ... నేడు జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ తో  99 మ్యాచులు  ఆడిన ఆటగాడిగా ధోని ని వెన్నక్కి నెట్టి  రికార్డును బ్రేక్ చేసేసాడు రోహిత్ శర్మ. ఇక ఆ తర్వాత సురేష్ రైనా 78... విరాట్ కోహ్లీ 72 ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: