జగన్మోహన్ రెడ్డిపై ద్వేషం లేదంటూనే విషం చిమ్మటం జనసేనాని పవన్ కల్యాణ్ కే చెల్లింది. తన రాజకీయ జీవితం ఇప్పటి వరకూ రెండు పాయింట్ల మీదే నడిచిన విషయం అందరికీ తెలిసిందే. మొదటిదేమో చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడటం. ఇక రెండోదేమో ఎంత వీలైతే అంతా జగన్ ను వ్యతిరేకించటం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా పవన్ స్టాండ్ లో మాత్రం ఏమాత్రం మార్పు లేకపోవటం ప్రతి ఒక్కరూ చూస్తున్నారు.

 

ఎట్టి పరిస్ధితుల్లోను జగన్ ను అధికారంలోకి రానీయకుండా అడ్డుకుంటానని ఒకవైపు చెబుతూనే మరోవైపు చంద్రబాబుకు మద్దతుగా ఓటేయండని చిత్తూరు రోడ్డుషోలో ప్రసంగించటం పవన్ కే చెల్లింది. ఇటువంటి ప్రసంగాలతోనే జగన్ అంటే పవన్ కు ఎంతమంటగా ఉందో అందరికీ అర్ధమైపోతోంది.

 

సరే ఇపుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసిపి ప్రభుత్వాన్ని ఏ స్ధాయిలో విమర్శిస్తున్నారో, ఆరోపణలు గుప్పిస్తున్నారో అందరు చూస్తున్నదే. తాజాగా ఇసుక కొరతపై విశాఖపట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ లో మాట్లాడుతూ జగన్ అంటే తనకు ఎటువంటి ద్వేషం లేదని ఒకవైపు చెబుతునే మరో వైపు విషం చిమ్మారు.

 

వైసిపిలో ఏకస్వామ్యం నడుస్తోందనే విషయాన్ని కొత్తగా కనిపెట్టినందుకు పవన్ కు వీరతాడు వేయాల్సిందే. ప్రాంతీయ పార్టీలంటేనే వ్యక్తుల ఆస్తన్న విషయం పవన్ కు తెలీదా ? ఏ ప్రాంతీయ పార్టీ అయినా పార్టీ వ్యవస్ధాపకుల ఆధీనంలోనే పనిచేస్తుందన్న కనీస ఇంగితం కూడా పవన్ కు ఉన్నట్లు లేదు. వైసిపిలో ఏకస్వామ్యం మాత్ర ఉందట ప్రజాస్వామ్యం లేనే లేదంటున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు తనకు ఏ అర్హతతో యువరాజ్యం అధ్యక్ష పదవి దక్కిందో చెప్పగలరా ?  అంతెందుకు తన మిత్రుడు చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను, ఎంఎల్సీగాను తర్వాత మంత్రిగా ఎలా అవకాశం దక్కిందో పవన్ మరచిపోయినట్లున్నారు. పవన్ మాటలను బట్టే జగన్ పై ఎంత విషం చిమ్ముతున్నారో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: