నవ్యాంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తోంది.ఈ  నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. కనీస ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించలేక మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించి న్యాయం చేయాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీని కోసం  టిడిపి బిజెపి పార్టీలు కూడా మద్దతు తెలిపాయి . 

 

 

 

 ఇక తాజాగా లాంగ్ మార్చ్ పూర్తిచేసుకుని సభావేదిక వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈ  సందర్భంగా ప్రసంగించారు. కార్మికుల బాధను చూడలేక లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నాని... ఇసుక కొరత సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అంతేకాకుండా తాను చంద్రబాబు దట్ఠపుత్రుడిని అని  చెబుతున్నారని... కానీ తన చంద్రబాబు దత్తపుత్రుడిని  కాదని ప్రజలకు దత్తపుత్రుడిని అని  పవన్ కళ్యాణ్ తెలిపారు . ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి పై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. సూటూ కేసు  కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి  రాజ్యసభ సభ్యుడిగా  ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డి కూడా తనను  విమర్శించే దౌర్భాగ్య స్థితి నెలకొంది అంటూ పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు. మేము  ఎన్నికల్లో ఓడిపోయామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించిన  పవన్... కాన్షిరాం,  అంబేద్కర్ లాంటి వాళ్లు కూడా ఎన్నికల్లో ఓడిపోయాడని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్  చెప్పారు. 

 

 

 

 

 రెండేళ్ల పాటు జైలులో వీళ్ళ నా గురించి మాట్లాడేది అంటూ పవన్ ఫైర్ అయ్యారు. వీళ్లు మన నాయకులు కావడం మన దురదృష్టం అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. మీరు పరిధి దాటి మాట్లాడితే   ఊరుకునే ప్రసక్తేలేదని తాట తీస్తాం అంటూ  పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. నా డిఎన్ఏ  గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నాది ఏ డిఎన్ఏ అని మీ  అమ్మాయి పెళ్ళికి నన్ను పిలిచారు అటు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 151 సీట్లు  గెలిచారని  కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు పవన్ .న్యాయం  కోసం పోరాటం జరిపితే  ఆర్మీ  వచ్చిన ఆపే ప్రసక్తే లేదని... అలాంటిది వీళ్ళెంత...వీళ్ళ సత్తా ఎంత అంటూ  పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: