ఉమ్మడి నల్గొండ  లోని ఆలేరు నియోజక వర్గం నుండి కొన్ని పరియాయలుతెలుగుదేశం పార్టీ నుండి మరియు కాంగ్రెస్ పార్టీ తరుపున  గెలిచి మంత్రి పదవులు దక్కించుకున్న దళిత సీనియర్ రాజకీయ  నేత మోత్కుపల్లి  నర్సింహులు గత సంవత్సరం తెలంగాణ టీడీపీ నుంచి బహిష్కరణకు బాధితుడైన  నేత ఇతను.

బహిష్కరణ అనంతరం చంద్రబాబునాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి  నేడు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు, తెలంగాణలోని అసంతృప్త, పార్టీ మారాలనుకునే  కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు ఆశ చూపి గాలం వేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మోత్కుపల్లిపై దృష్టిసారించింది. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయం లో మోత్కుపల్లి జనాసేన  పార్టీ లో చేరుతున్నట్లు వార్తలు రావడం అతడు కూడా చర్చల్లో పాల్గొనడం చేత మోత్కుపల్లి జనాసేన లో చేరడం ఖాయం అనుకున్నారు అనూహ్యంగా అతడు చేరడం లేదని ప్రకటించాడు. అలాగే గత ఎన్నికలలో ఆలేరు నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఎప్పుడు మోత్కుపల్లి  ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.

వారి ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.ఆయనను చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. దీంతో ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించింది. ఎదో ఒక పార్టీలో చేరుదామనుకునే మోత్కుపల్లి  కూడా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల ఆహ్వానాన్ని స్వకరించాడని అతడు త్వరలో భాజపాలో చేరుతాడని  సమాచారం. అన్నీ అనుకున్నవి  అనుకున్నట్టు జరిగితే నేడు ఆయన కాషాయ కండువా కప్పుకుని భాజపా లోకి చేరవచ్చని  అతని సన్నిహితులు కూడా  చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: