రాష్ట్రంలో ఇసుక సమస్యల మీద .. భవన కార్మికుల తరుపున నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతీ తెలిసిందే. అది పేరుకే లాంగ్ మార్చ్ నిజానికి కిలోమీటర్ కూడా లేదు. అంత దానికే పెద్ద పెద్ద పదాలు ఉపయోగించడం. ఇక పవన్ కళ్యాణ్ అయితే కనీసం కారు కూడా దిగకుండా లాంగ్ మార్చ్ చేశారు. అయితే భహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎప్పటి మాదిరిగానే ఆవేశంగా .. పూనకం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడినారు. వైసీపీ నాయకుల తాట తీస్తా .. మూల కూర్చోబెడతా అంటూ పవన్ గారి ప్రసంగం సాగింది. దీనితో పవన్ మీద వైసీపీ ఓ రేంజ్ లో విరుచుకుపడింది. అయితే పవన్ స్పీచ్ లో భవన కార్మికుల గురించి చెప్పకుండా తన స్వంత డబ్బా ఎక్కువయిపోయిందని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. 


ప్రతి స్పీచ్ మాదిరిగానే ఈ స్పీచ్ లో కూడా పవన్ .. ప్రజల కోసం సినిమాలు వదిలేశానని, త్యాగం చేశానని పాడిందే మళ్ళీ పాడిండు. గత ఓటమి నుంచి పవన్ గారు ఏమి నేర్చుకోలేదని తేటతెల్లం అవుతుంది. పవన్ ఆవేశపూరిత స్పీచ్ తన అభిమానులకు నచ్చుతుందేమోగాని సగటు జనాలకు నచ్చదని ఎటువంటి సందేహం లేకుండా చెప్పాలి. ఒక రాజకీయనేత మాటల్లో ఏ మాత్రం ఆవేశం ఉండకూడదు. చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలి గాని .. స్వంత డబ్బా కొట్టుకుంటే ఎవరు మాత్రం వింటారు. 


ఇసుక మీద మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ మీదే మాట్లాడాలి. అంతే గాని వైసీపీ నాయకుల తాట తీస్తాను. అమరావతి వీధుల్లో నడుస్తాను. నేనంటే మోడీకి చాలా ప్రేమ ఇవన్నీ మాట్లాడితే ఇసుక సమస్య తీరుతుందా .. ఇప్పుడు పవన్ గారు అమరావతి విధుల్లో తిరిగితే ఇసుక ఇంటి ముందుకు వచ్చేస్తుందా .. నోరు తెరిస్తే మోడీని కలుస్తానని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కి కనీసం కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక దేశ ప్రధాన మంత్రి ఇస్తాడా ? ఇప్పటికైనా పవన్ మారితే తన రాజకీయాలకు ప్రతిఫలం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: