మనం పనితో అలిసిపోయి వంట చేయకున్నా, వర్షం వచ్చి బయటికి వెళ్లే వీలుకాకుంటే  మనకు భోజనం ఇంటికే వస్తుంది, ఈ వస్తువు కావాలన్నా మన ఇంటికే వచ్చి చేరుతుంది అలాంటి వసతులున్న ఈ రోజుల్లో  అలాగే బంకుకు వెళ్లాలన్నా మీ వాహనంలో ఇంధనం లేదా? అయితే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు! 

త్వరలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే మొబైల్ బంకులు మన తెలుగు రాష్ట్రాల పరిధిలోను అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలో తొలిసారి సూర్యాపేట జిల్లా నడిగూడెం కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతి లభించింది.ఇవి పెట్రోల్ టాంకర్ లో నింపి వివిధ స్థలాలలో ఏర్పాటు చేస్తారు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారికీ అమాంతం ఇంటికే వచ్చి హోమ్ డెలివరీ చేస్తారు.  గ్రామాల్లోని వారి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ అయిపోతే మన వాహనాన్నీ అక్కడే ఉంచేసి ఆటో లోనో బస్సు లోనో వెళ్లి ఎక్కడ దొరికితే అక్కడ దుకాణాల్లో అమ్మే వారి నుంచి కొనుగోలు చేసి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది.

అయితే ఎప్పుడు మన సౌలభ్యం కోసం  ఇప్పుడు పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ చేసే ట్యాంకర్లు రానుండటం గమనార్హం. హోమ్ డెలివరీ కోసం వినియోగించే వాహనాల్లో ఓ వైపు పెట్రోల్, మరోవైపు డీజిల్ పంపులు ఏర్పాటు చేస్తారు.

అన్ని గ్రామాలకు వెళ్లి రైతులు, ఇతర వాహనదారులకు పెట్రోల్, డీజిల్ అందిస్తారు అయితే సూర్యాపేట జిల్లాలోని  నడిగూడెం కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ పెట్రోల్  బంకుకు అనుబంధంగా ఈ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటినుండి పెట్రోల్ డీజిల్ సేవలు మన వాకిట్లోకి  రావడం తో ఊర్లలో వాటి వినియోగదారులకు వాటి కష్టం కొంచం తగ్గుతుంది అని హర్షం వక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: