అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పాలనపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలి అవటం అన్ని వైపుల నుండి విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎల్వీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితలయ్యారు. అప్పటి నుండి ఆయనకు చంద్రబాబునాయుడుకు మధ్య జరిగిన వివాదాలు సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే.

 

ఎన్నికల్లో వైసిపి అఖండ మెజారిటితో గెలిచిన తర్వాత జగన్ ఎల్వీనే ప్రధాన కార్యదర్శిగా కంటిన్యు చేశారు. అయితే ఓ 15 రోజుల క్రితం సిఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో ఎల్వీకి గొడవలు మొదలయ్యాయి. ఎల్వీఏమో నియమాలు, నిబంధనలు చూసే వ్యక్తయితే ప్రవీణ్ ఏమో తాను చెప్పిందే నియమము, నిబంధన అని నమ్మే వ్యక్తి. తన పై వాళ్ళకు సహకరించడు, కిందవాళ్ళను రాచి రంపాన పెడతాడనే ఆరోపణలు ప్రవీణ్ పై చాలా కాలంగా వినిపిస్తోంది.

 

అలాంటి ప్రవీణ్ ఢిల్లీ నుండి బిజెపిలోని కీలక నేత రికమెండేషన్ తో  అమరావతికి వయ్చారని సమాచారం.  ప్రవీణ్ వచ్చిన దగ్గర నుండి ఎల్వీతో గొడవలు పెరిగిపోయాయి. ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ అధికారాలను లాగేసుకుని  ప్రవీణ్ పెత్తనం  మొదలుపెట్టారు. ఈ విషయంలోనే ప్రవీణ్ కు ఓ మెమో ఇచ్చిన ప్రధాన కార్యదర్శి వారంలోగో సమాధానం చెప్పమని ఆదేశించారు.

 

వీరిద్దరి మధ్య గొడవలు ప్రభుత్వ పాలనపై తీవ్రంగా పడుతోంది. ఎందుకంటే ప్రవీణ్ అరాచకాలను భరించలేక ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులు శెలవులు పెట్టేయటం కూడా ఆమధ్య సంచలనంగా మారింది. మళ్ళీ ఏదోలా సర్దుబాటైంది. అదే సమయంలో మంత్రుల్లో ఒకరిద్దరితో కూడా సిఎస్ కు పడటం లేదని తెలిసింది. దాంతో జగన్ కూడా ఎల్వీపై అసంతృప్తితో ఉన్నట్లు అమరావతి సమాచారం.

 

ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా ప్రధాన కార్యదర్శిగా ఎల్వీని బదిలి చేయటం అధికారయంత్రాంగంలో సంచలనమైంది. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్ధ డైరెక్టర్ జనరల్ గా బదిలి చేయటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా తొందరలోనే ఎల్వీ ఉద్యోగ విరమణ చేయబోతున్నట్లు సమాచారం.

 

మొత్తం మీద అరాచకవాదిగా ప్రచారంలో ఉన్న ప్రవీణ్ తో గొడవల వల్లే క్రమశిక్షణకు మారుపేరైన ఎల్వీని బదిలీ చేశారనే ప్రచారమైతే బాగా జరుగుతోంది. ఏదేమైనా ఎల్వీ బదిలీ విషయంలో జగన్ తప్పు చేశారనే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: