లాంగ్ మార్చ్ సందర్భంగా విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్  చేసిన ఆరోపణలు, విమర్శలపై  వైసిపి నేతలు వాయించేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, ఎంఎల్ఏ అంబటి రాంబాబు  వేసిన ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెబితే చాలన్నట్లు తయారైంది పవన్  ప్రస్తుత పరిస్ధితి.

 

పవన్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ లో కన్నబాబును తన సోదరుడు, నరసాపురం ఎంపిగా పోటి చేసిన నాగుబాబు గెలిపించారంటూ పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు. దానిపై మంత్రులు తీవ్రంగా స్పందించారు. కన్నబాబును గెలిపించింది వాస్తవమే అయితే సోదరుడు నాగుబాబు ఎందుకు ఓడిపోయారంటూ నిలదీశారు. అదే సమయంలో నాగుబాబును పవన్ ఎందుకు గెలిపించలేదో చెప్పాలంటూ సూటిగానే ప్రశ్నించారు.

 

నిజానికి కన్నబాబును గెలిపించేంత సీన్ నాగుబాబుకు లేదు. అలాంటిది కన్నబాబును తన సోదరుడు గెలిపించిందే నిజమైతే మరి నాగుబాబు ఎందుకు ఓడిపోయారన్నదే కీలక ప్రశ్న. మరి పై ప్రశ్నలకు పవన్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి. ఒకళ్ళని గెలిపించేంత సీన్ నాగుబాబుకు ఉందని పవన్ నమ్మితే మరి పోటి చేసిన రెండోచోట్లా పవన్ ఎందుకు ఓడిపోయారో చెప్పాలంటూ కొడాలి నాని గట్టిగా అంటుకున్నారు. మరి పవన్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారా ?

 

జగన్మోహన్ రెడ్డి పాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదే వాస్తవమైతే తన లాంగ్ మార్చ్ లో  పాల్గొనాలంటూ పవన్ ఇతర పార్టీలను ఎందుకు బతిమలాడుకున్నారో చెప్పాలంటూ కొడాలి నాని మండిపోయారు. మరి కొడాలి అడిగిన ప్రశ్నకు పవన్ స్పందిస్తారా ?

 

లాంగ్ మార్చ్ లో పాల్గొనాలంటూ వామపక్షాలు మొదలుకుని బిజెపి, టిడిపి పార్టీలకు బహిరంగ విజ్ఞప్తి చేయటమే కాకుండా పార్టీల అధినేతలకు ఫోన్లు చేసి మరీ బతిమలాడుకున్నది వాస్తవమే. మామూలు జనాలు లేరని చెబుతునే మొన్నటి ఎన్నికల్లో జనాలే పార్టీతో పాటు పవన్ తాటను తీసేశారు అంటూ అంబటి చురకలంటించింది వాస్తవమే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: