చంద్రబాబునాయుడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటానికి విమర్శించటానికి అవకాశం వస్తే చాలు రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉంది.  బదిలీ తీరు చాలా అమానవీయంగా ఉందంటూ ఎల్వీపై సానుభూతి చూపిస్తు చంద్రబాబు దొంగేడుపులు ఏడుస్తున్నారు.

 

 చంద్రబాబుకు అంత సానుభూతి ఉన్నదే నిజమైతే  మరి తాను సిఎంగా ఉన్నపుడు ఇదే ఎల్వీని ఎందుకు ఎంపిక చేయలేదు ?  సీనియర్ అయిన ఎల్వీని కాదని అనీల్ చంద్ర పునేతాను చంద్రబాబు ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు ?  బదిలీ విషయంపై మాట్లాడుతు వ్యక్తుల కన్నా వ్యవస్ధలు చాలా ప్రధానమని కతలు చెబుతున్నారు. అసలు సర్వ వ్యవస్ధలను భ్రష్టు పట్టించేదే చంద్రబాబన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఒక్క ప్రధాన కార్యదర్శి విషయంలోనే కాదు డిజిపి నియామకంలో కూడా చంద్రబాబు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి చంద్రబాబు కూడా ఇపుడు వ్యవస్ధలు, నియమ, నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎల్వీని జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేశారంటూ మండిపోయారు.

 

సిఎస్ గా ఎల్వీని ఎందుకు బదిలీ చేశారో సిఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. తమ  హయాంలో జరిగిన బదిలీలకు చంద్రబాబు ఏనాడన్నా సమాధానం చెప్పారా ? నిజానికి ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి ? ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నది పూర్తిగా సిఎం ఇష్టమే. తన అర్హతకు తగ్గ పోస్టింగ్ దక్కలేదని అనుకుంటే సదరు అధికారి సిఎంతో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటారు. ప్రభుత్వ యంత్రాంగంలో బదిలీల విషయంలో ఇవన్నీ మామూలే. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు, అచ్చెన్న అండ్ కో మాత్రం ఎల్వీ బదిలీని రాజకీయంగా వాడుకుని జగన్ ను ఇరుకునపెట్టాలని చూస్తుండటమే విచిత్రంగా ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి చివరకు ఇంత చీప్ గా దిగజారిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: