జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ చంద్రబాబుకు కూడా నచ్చలేదని రాజకీయాల్లో వినిపిస్తున్న భోగోట్టా. చంద్రబాబు మొదటి నుంచి వైసీపీ ఇసుక మాఫియా చెలరేగుతుందని ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఎక్కడ కూడా వైసీపీ ఇసుక మాఫియా గురించి మాట్లాడిన ధాఖలు లేవు. దీనితో సహజంగానే బాబు చెబుతున్నట్టు పవన్ చెప్పకపోవడంతో బాబు గారికి ఒకింత అసంతృప్తి వచ్చింది. పవన్ కల్యాణ్ ను ఇప్పుడు ఉసిగొల్పింది కూడా చంద్రబాబు నాయుడే అనేది ప్రముఖంగా వినిపించే అభిప్రాయం. చంద్రబాబు నాయుడుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది.


గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ పొద్దు పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చి కనీసం ఐదు నెలలు కాకముందే పవన్ తెగ హడావిడి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరిస్తూ ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఆ సంగతలా ఉంటే.. స్థూలంగా పవన్ కల్యాణ్ ప్రసంగం చంద్రబాబును కూడా మెప్పించలేదట. అందుకు కారణం ఏమిటంటే.. ఇసుక కొరతకు వరదలు కారణం కాదనేది తెలుగుదేశం వాదన. శాండ్ మాఫియా అంటోంది తెలుగుదేశం పార్టీ.


గత ప్రభుత్వంలో ఇసుకను పూర్తిగా టీడీపీ మాఫియా కంట్రోల్ చేసింది. కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఆ అవకాశం లేదని చెప్పాలి. అయితే కొరత ఏర్పడిన నేపథ్యంలో అదంతా మాఫియా పని అని చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉన్నారు. అయితే పవన్ ఆ వాదనను వినిపించలేదు. శాండ్ మాఫియా ఊసే ఎత్తలేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్టుగా  టాక్. .పూర్తిగా తను మాట్లాడినట్టే మాట్లాడాలని చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ విషయంలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టున్నాడు! 

మరింత సమాచారం తెలుసుకోండి: