రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయ రెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుడు సురేష్ పక్కా పథకం ప్రకారమే విజయసాయిరెడ్డిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా  మధ్యాహ్నం సమయంలో అందరూ ఉండగానే తాహసిల్దార్ విజయారెడ్డి రూమ్ లోకి వెళ్ళిన నిందితుడు సురేష్ అరగంట పాటు బయటకి రాలేదు   అనంతరం విజయ రెడ్డి మంటలతో బయటకు వచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు విజయారెడ్డి నీ  కాపాడేందుకు మిగతా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వారికి కూడా గాయాలయ్యాయి. నిందితుడు  సురేష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సురేష్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే తహసిల్దార్ విజయ రెడ్డి పై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సురేష్ తనపై తాను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయ రెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కి  వెళ్లి లొంగిపోయాడు. 




 కాగా  కాలిన గాయాలతో ఉన్న సురేష్ ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా  65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్ కు ఉస్మానియాలో పోలీసుల రక్షణ మధ్య  చికిత్స అందిస్తున్నారు. ఇంకా 74 గంటలు దాటితే కానీ సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పలేము  అని ఉస్మానియా డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సురేష్ న్యూరోబర్న్ షాక్  లో ఉన్నాడని తెలిపిన డాక్టర్ లు...  24 గంటలు దాటితే  స్కిన్ బర్న్   సెప్టిక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతకు ముందుగా పోలీసులు నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కొంతకాలంగా భూమి పట్టా కోసం తాహసిల్దార్ చుట్టూ తిరిగానని  నిందితుడు సురేష్ తెలిపాడు. తాసిల్దార్ విజయ రెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని... ఈ క్రమంలోనే తాసిల్దార్ విజయారెడీపై  పై కక్ష పెంచుకుని హత్య చేయాలనుకున్నా అంటూ సురేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. 



 కాగా  ఒక్క లీటర్ పెట్రోల్ బాటిల్ ను  ముందుగానే కొనుక్కుని బాగ్ లో పెట్టుకున్నాను అని ... ఆ తర్వాత తాహసిల్దార్ విజయారెడ్డి దగ్గరికి వెళ్లి భూమి పట్టా కోసం వేడుకున్నానని...  కానీ పట్టలేదని విజయ రెడ్డి చెప్పడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాననీ  నిందితుడు సురేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. కాగా  తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తో  తెలంగాణలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఉద్యోగ సంఘాల నిరసనలు తెలుపుతున్నాయి . నిందితుడు సురేష్ కోలుకుంటే  గాని ఈ హత్యకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలిసే అవకాశం లేదు. కాగా  ప్రస్తుతం నిందితులు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: