రణంగా సాధు జంతువులు ఎంతో సౌమ్యంగా ఉంటాయంటారు..కానీ వాటికి కోపం వస్తే తట్టుకోవడం కూడా కష్టమంటారు.  సాధారణంగా మన ఇళ్లల్లో కొడి, కుక్క,ఆవు, ఎద్దు ఇలా కొన్ని పక్షులను, జంతువులను సాకుతాం.  కొన్ని సార్లు వీటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తుంటాం.  ముఖ్యంగా ఎద్దు, ఆవు  లాంటి పెద్ద జంతువులు ఆగ్రహిస్తే మాత్రం వాటిని తట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు.  మనుషుల్ని బంతుల్లా ఎగరేస్తుంటాయి..అడ్డం వస్తే దేనినైనా వాటి కొమ్ములతో పెకిలిస్తుంటాయి. 

అయితే బుల్స్ ఫైట్ గురించి తెలిసిందే..వీటితో ఎంత ఎంట్రటైన్ ఉంటుందో అంతే డేంజర్ కూడా ఉంటుంది.  ఇక ఎద్దుల పందాల గురించి తెలిసిందే..కొన్ని సార్లు అపశృతులు జరుగుతుంటాయి.  తాజాగా బీహార్ హాజీపూర్‌లో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. నడి రోడ్డుపై తన ప్రతాపం చూపించింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది. ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చాలా కసితో  ఆ కారును ఎత్తి కుదిపేసింది. అదృష్టం ఏంటంటే ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం.   

ఆ పొగరు బోతు ఎద్దును అక్కడి నుంచి పంపేందుకు కొందరు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. కోపంతో చిందులేస్తున్న ఎద్దు కొద్ది సేపటికి శాంతించింది. ఆ తర్వాత తన దారిన తాను వెళ్లిపోయింది.  గతంలో కూడా ఈ ఎద్దు హాజీపూర్ రైల్వే స్టేషన్ రహదారిలో బీభత్సం సృష్టించిందని స్థానికులు చెబుతున్నారు. హాజీపూర్‌లో ఈ ఎద్దు తిరుగుతుందన్న భయంతో ఈ రోడ్డు వదిలేసి మరో దారిలో వెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడ సోషల్ మీడియాలో రావడం చూస్తూనే ఉంటాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: