ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జనసేనకు అంత పెద్ద ధర్నాను నిర్వహించే శక్తి లేదని కొంత మంది నుంచి వినిపిస్తున్న మాటలు. పైగా ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయిన నేత. ఈ పరిస్థితుల్లో జనసమీకరణ అంటే అంత సులభం కాదని చెప్పాలి. అయితే పవన్ కు అడుగడుగునా తెలుగుదేశం పార్టీ సాయపడిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఆఖరికి భోజన ఏర్పాట్లు ఆర్థిక వనరులు.. వచ్చిన వారికి రెండు వందల యాభై రూపాయలు..వంటివన్నీ టీడీపీనే సమకూర్చిందని ప్రచారం సాగుతూ ఉంది. జనసమీకరణ విషయంలో ముందే అనుమానాలతో.. మార్చ్ ను రెండు కిలోమీటర్ల పరిధికే పరిమితం చేశారని కూడా విశ్లేషకులు అంటున్నారు. మార్చ్ ను పొడిగిస్తే జనాలు రారని తెలిసినట్టుంది. 


అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారు. అది కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని తెలుస్తుంది. అయితే అది పొద్దున్నుంచి సాయంత్రం వరకే కావొచ్చు. ఇసుక విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు ఇప్పుడు ఆ పార్టీ చెబుతున్న గాంధేయవాదానికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా చంద్రబాబు నాయుడు హడావుడి చేయబోతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగడం అధికారం పోగానే దీక్షలు చేయడం మాములు వ్యవహారమని చెప్పాలి. 


అయితే చంద్రబాబు చేస్తున్న ధర్నాకు ఖచ్చితంగా పవన్ మద్ధతు ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్నికల నాలుగు నెలల ముందు చంద్రబాబు మీద విరుచుకుపడిన పవన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తుంది. తనకు చంద్రబాబు నాయుడు మద్దతు పలికిన నేపథ్యంలో పవన్ ఆయన ప్రొగ్రామ్ కూ మద్దతు పలకవచ్చు. ఇలా తమ బంధాన్ని బహిరంగంగానే చాటే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన ఒకటేనని జనాల్లోకి బలంగా పోయింది. ఇటువంటి ప్రచారం జనసేన పార్టీకే దెబ్బని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: