ఒకే సమస్యపై ఓ ప్లాన్ ప్రకారం తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుతున్నాయి. ఈనెల 14వ తేదీన విజయవాడలో ఇసుక కొరతపై చంద్రబాబునాయుడు 12 గంటల పాటు దీక్ష చేయాలని నిర్ణయించారు. దీక్ష చేసే స్ధలం ఇంకా డిసైడ్ కాకపోయినా  ప్రోగ్రామ్ మాత్రం ఫైనల్ అయిపోయింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి ప్రకటనతోనే జగన్ పై జనసేన, టిడిపిలు ఎంత వ్యూహాత్మకంగా బురద చల్లుతున్నాయో అర్ధమైపోతోంది.

 

ఇసుక కొరత అని భవన కార్మికులకు మద్దతు అంటూ నాలుగు రోజుల క్రితం గుంటూరులో టిడిపి ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ దీక్ష చేసిన విషయం తెలిసిందే. నిజానికి రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నమాట వాస్తవమే. కానీ చంద్రబాబు, పవన్ , వామపక్షాలు, బిజెపి నేతలు ఆరోపిస్తున్నంత స్ధాయిలో మాత్రం లేదు.

 

ఎందుకంటే ప్రభుత్వం గుర్తించిన 270 ఇసుక రీచ్ లలో 65 రీచ్ ల నుండి ఇసుక సరఫరా అవుతోంది. భారీ వర్షాల కారణంగా మిగిలిన రీచ్ ల నుండి మాత్రం ఇసుక తవ్వకాలు సాధ్యం కావటం లేదని ప్రభుత్వం చెబుతోంది.  సరే అసలు కారణాలు ఏవైనా రాజకీయం రాజకీయమే కాబట్టి వాస్తవాలు తెలిసినా జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. అందుకనే లోకేష్ దీక్ష పేరుతో పెద్ద ప్రహసనమే నడిపారు.

 

రెండు రోజుల క్రితం ఇదే అంశంపై విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్  పేరుతో మరో కతనడిపారు. 10 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి 2.5 కిలోమీటర్లు కారుపై నిలబడి చేతులూపుకుంటు ప్రయాణించారు. అదే సమయంలో బిజెపి కూడా దీక్షపేరుతో పెద్ద డ్రామానే నడిపింది.  ఇక మరో వారం తర్వాత చంద్రబాబు డ్రామా చేయబోతున్నారు. మొత్తం మీద ఎవరు ఏం చేసినా సమస్యకు మాత్రం పరిష్కారం చూపటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: