తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33 వ రోజుకు చేరుకుంది. గత ముప్పై మూడు రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు డెడ్ లైన్ లు  విధించినప్పటికీ కూడా సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు తమ డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. అయితే తాజాగా వరంగల్లోని హనుమకొండ లోకల్ డిపో వద్ద  ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులకు సిపిఐ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న సిపిఐ నేతలు చాడ వెంకట్రెడ్డి నారాయణలు... కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో మొండి వైఖరిని వీడాలని లేనిపక్షంలో ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెబుతారని సీపీఐ నేత  నారాయణ అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం అధైర్య పడకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని వారికి తమ మద్దతు ఉంటుందని సిపిఐ నేత నారాయణ  హామీ ఇచ్చారు.

 

 

 

 ఆర్టీసీ కార్మికుల నిరసన లో భాగంగా వరంగల్ జిల్లా హనుమకొండ లో మహిళా కార్మికులు  టీ తయారు చేసి  విక్రయించారు. అయితే వారికి మద్దతు ప్రకటించిన సిపిఐ నేత నారాయణ రెండు వందల రూపాయలు ఇచ్చి టీ  కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన జీతాలను ఇవ్వకపోయినా... కార్మికులు టీ  అమ్ముకుని అయినా   జీవిస్తామని... కానీ డిమాండ్ల పరిష్కారం అయ్యేవరకు సమ్మె విరమించమని  చెబుతున్నారని వారిలోని ఆత్మస్థైర్యానికి ఇదే నిదర్శనం అంటూ సీపీఐ నేత నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చి బేషరతుగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నిన్న అర్ధరాత్రి  12:00 లోపు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరికీ డెడ్ లైన్  విధించిన విషయం తెలిసిందే. అర్థరాత్రి లోపు విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులందరినీ  ఉద్యోగాల నుంచి తొలగించినట్లే  అని మరోసారి కేసీఆర్ హెచ్చరించారు. 

 

 

 

 

 అయితే కేసీఆర్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు . కెసిఆర్ బెదిరింపులకు కార్మికులు ఎవ్వరు భయపడే ప్రసక్తి లేదని...  సమ్మె యదాతధంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకారమే  నిరసన కార్యక్రమాలు చేపడతామని... కెసిఆర్ చిత్తశుద్ధితో ఆర్టీసీ జేఏసీ తో చర్చలు జరపాలని తెలిపారు. కాగా  కెసిఆర్ విధించిన డెడ్ లైన్ లోపు  ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించకపోవటంతో...  సీఎం కేసీఆర్ తదుపరి నిర్ణయం ఏం  తీసుకోబోతున్నారు అనేదానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమ్మె మొదలైనప్పటి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  మొండివైఖరి తోనే కేసీఆర్... తాజాగా కేసీఆర్ డెడ్ లైన్ ను  ఆర్టీసీ కార్మికులు బేఖాతరు చేయడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: