నీదారి నీది. నాదారి నాది మధ్యలో ఉన్న ప్రజలకు గోదారి దిక్కు అనేలా తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో  కేసీయార్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉంది. ఎవరి పంతం వారు కొనసాగిస్తున్నారు. వారి వారి మాటలను నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఈ దశలో ప్రజారవాణ వ్యవస్ద ఎంతలా పతనమైందో, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనసుపెట్టి ఆలోచించేవారు లేరు. పాలకులున్నది ప్రజలకోసం, బస్సులు నడుపుతున్నది కూడ ప్రజల కోసం కాని ఇప్పుడు ప్రయాణికుడు ఓ తోలు బొమ్మలా మారాడు.


తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలు వారి వారి ఆటలను ఆడుతుండగా ప్రజలు మాత్రం తమ కష్టార్జితాన్ని దళారులకు సమర్పించుకుంటూ నానాయాతన పడుతూ తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల దృష్ట్యా అసలు సమ్మె ఎప్పుడు ముగుస్తుందో, తిరిగి పూర్వపు పరిస్థితి ఎప్పుడు కనిపిస్తుందోనని యావత్‌ తెలంగాణ జనం ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీయార్ సమ్మె వదిలి విధుల్లోకి రండి అంటూ ముచ్చటగా మూడోసారి చేసిన వినతిని సైతం కార్మికులు తిరస్కరించటంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది.


కార్మికులకు ఇదే చివరి అవకాశమని, విధుల్లోకి రాని పక్షంలో వారికి సంస్థతో అసలు సంబంధాలే ఉండవని సీఎం ఇచ్చిన గడువును కార్మికులు బేఖాతరు చేయటంతో పరిస్థితి అర్ధంకాని విధంగా మారింది. మరోవైపు ప్రభుత్వం.. ముందే ప్రకటించినట్టుగా ప్రైవేటు బస్సులతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది. ఇదేకాకుండా విధుల్లోకి నామమాత్రంగానే కార్మికులు చేరటంతో ఆర్టీసీలోని ప్రధాన మార్గాలన్నింటిలోకి ప్రైవేటు బస్సులను అనుమతించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


కాగా 5,100 రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లు ఇచ్చి, మిగతా రూట్లను ఆర్టీసీకి వదిలేయాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు  ఐదో తేదీ అర్ధరాత్రి వరకు కేవలం 495 మంది మాత్రమే విధుల్లో చేరారు. అందుకే మిగతా రూట్లకు కూడా ప్రైవేటు బస్సులను నడపాలనే దిశగా చర్చలు జరిగినట్టు సమాచారం. ఇదే కనుక జరిగితే తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు ఇక కనిపించవని వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి: