చంద్రబాబునాయుడు, పుత్రరత్నం నారా లోకేష్, ఎల్లోమీడియా మనోగతం ఇదేలాగుంది. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో చావుదెబ్బ తిన్నదగ్గర నుండి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.  మరి చంద్రబాబు బాధపడితే ఎల్లోమీడియా కూడా తట్టుకోలేందు కాబట్టి ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లుతోంది. అందుకనే జగన్ ను పనికిమాలిన సిఎం అని చెత్త సిఎం అంటూ చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.  

 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొద్దిరోజుల వరకూ బుర్ర సక్రమంగా పనిచేసినట్లు లేదు. అందుకనే జగన్ దెబ్బ నుండి కోలుకోవటానికి కొంత సమయం తీసుకున్నారు. ఆ తర్వాత నుండి మెల్లిగా మీడియా ముందుకు తర్వాత జిల్లాల పర్యటనల పేరుతో చంద్రబాబు మొదలుపెట్టిన  డ్రామాలు చూసి  అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

కొద్ది రోజులుగా జిల్లాల పర్యటనలో కానీ ట్విట్టర్ లో కానీ చంద్రబాబు అయినా లోకేష్ అయినా చెప్పేదొకటే. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగిపోయి వెంటనే చంద్రబాబు సిఎం అయిపోవాలి అంతే. ఎన్నికలు జరిగి ఆరు మాసాలు కూడా కాలేదని ఇంకా నాలుగున్నరేళ్ళు జగనే సిఎంగా ఉంటాడన్న విషయాన్ని తండ్రి, కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

అందుకనే జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన జగన్ ను పనికిమాలిన సిఎం అని చంద్రబాబు అంటున్నారంటేనే ఆయనలోని ఫ్రస్ట్రేషన్ అర్ధమైపోతోంది.  తన హయాంలో ఏపని చేసినా తనిష్టప్రకారమే చేసుకున్నారు చంద్రబాబు.

 

రాజధాని ఎంపిక లాంటి ప్రధానమైన నిర్ణయంపైనా ప్రధాన ప్రతిపక్షమైన వైసిపితో కనీసం మాట్లాడలేదు.  ఆ విషయాన్ని  అప్పట్లో వైసిపి కూడా పట్టించుకోలేదు.  కానీ ఇపుడు జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలను తమతో సంప్రదించలేదన్నట్లుగా టిడిపి ఆరోపిస్తుండటమే విచిత్రంగా ఉంది. ఒకవైపేమో చాలామంది టిడిపి ఎంఎల్ఏలు, నేతలు వైసిపిలో జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో  జగన్ ది చెత్తపాలన అంటున్న చంద్రబాబుకు తొందరలో జరగబోయే స్ధానిక ఎన్నికలే సమాధానం చెబుతాయేమో చూడాలి.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: