ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో  సరికొత్త పథకాలను ఊపిరి పోస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేద విద్యార్థి స్కూల్ కి వెళ్లి చదువుకోవాలని ఉద్దేశంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి చేయూతనిచ్చి  తమ తమ పిల్లలను బడులకు పంపేలా  ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నిర్ణయించారు. 



 అయితే అమ్మ ఒడి పథకం రాష్ట్రంలో జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పుడు వరకు ఆర్థిక స్థితి సరిగ్గా లేక తమ పిల్లలను బడికి పంపేందుకు వెనకబడిన తల్లిదండ్రులందరు  జగన్ ఇచ్చిన చేయూతతో తమ  పిల్లలను చదివించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మార్చాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి విద్య అందుతుందో  అంతకు మించిన మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 



 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. 2020 -21 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధించాలని తెలిపిన ప్రభుత్వం.. 2021- 22 విద్యా సంవత్సరంలో 9, 10 వ  తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో ఉంచాలని  మార్గదర్శకాలను రూపొందించింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తాజాగా మార్పులను చేసింది. అయితే ముందు జారీచేసిన జీవో ప్రకారం 2021 22 విద్యా సంవత్సరంలో 9 10 తరగతులలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంచాలని భావించిన ప్రభుత్వం... తాజాగా 2021 -22 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో 2022 -23 లో పదో తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని  నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయా తరగతుల్లో తెలుగు ఉర్దూ  సబ్జెక్టును కూడా  పెట్టాలని తాజా ఉత్తర్వులతో పేర్కొంది జగన్ సర్కార్.


మరింత సమాచారం తెలుసుకోండి: