మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు, డిమాండ్లు చూస్తుంటే చంద్రబాబునాయుడుకు ఏమో అయ్యిందనే అనుమానం వస్తోంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీదే ముందు రౌడీ షీటర్ కేసు పెట్టాలని పోలీసులను డిమాండ్ చేయటమేంటి ? పోలీసులకు నిజాయితి ఉంటే ముందే జగన్ పైనే రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

జగన్ పైన రౌడీషీట్ ఎందుకు ఓపెన్ చేయాలి ? ఎందుకంటే  టిడిపి కార్యకర్తలపై జిల్లాల్లో రౌడీషీట్ కేసులు ఓపెన్ చేస్తున్నారట. చంద్రగిరిలో మూడు రోజులుగా నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు తమ బాధలను చెప్పుకుంటున్నారు. ఆ సందర్భంగా తమపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, రౌడీషీట్లు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. టిడిపి చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకూ నిజముందో కూడా తెలీటం లేదు.

 

సరే వారు ఫిర్యాదు చేయటం ఆలస్యం చంద్రబాబు రెచ్చిపోయారు. చంద్రబాబు వీరంగాలు చూస్తుంటే ఇదంతా ప్రీప్లాన్డ్ గా జరుగుతోందా అన్న అనుమానం వస్తోంది. నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేయటం, చంద్రబాబు రెచ్చిపోవటమంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతోంది. సమావేశం ఏదైనా, విషయం ఏదైనా సరే జగన్ ను టార్గెట్ చేయాలి, పోలీసులకు వార్నింగ్ ఇవ్వాలి అన్న పద్దతిలోనే నడుస్తోంది జిల్లాల పర్యటన.

 

నిజంగానే పోలీసులు జగన్ పై రౌడీషీటర్ ఓపెన్ చేయాల్సొస్తే చంద్రబాబుపై ఎన్నిసార్లు రౌడీషీటర్ ఓపెన్ చేయాల్సొచ్చేదో ? టిడిపి హయాంలో వైసిపి ఎంఎల్ఏలపైనే కేసులు పెట్టిన విషయం చంద్రబాబు మరచిపోయారా ?  వైసిపి నేతలు చెఱుకులపాడు నారాయణరెడ్డి, ప్రసాదరెడ్డి హత్య జరిగినందుకు చంద్రబాబుపై ఎటువంటి కేసులు పెట్టాలి ? తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి నేతలపై ఎన్ని కేసులు పెట్టి రిమాండుకు పంపారో మరచిపోయారా ?

 

అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం నేతలపై కేసులు పెట్టటం మామూలైపోయింది. టిడిపి అధికారంలో ఉన్నపుడు పద్దతి ప్రకారం పరిపాలన చేసుంటే ఇపుడు వైసిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా విలువుండేది. వైసిపి ఎంఎల్ఏ రోజా చెబుతున్నట్లు చంద్రబాబుకు పెద్దమెదడే చితికిందో లేకపోతే చిన్నమెదడో చితికిందో తెలీటం లేదు. మొత్తానికి మాజీ సిఎంకు ఏదో అయ్యిందనే అనిపిస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: