సినిమాల్లో ఒక రేంజ్లో రాణించి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తుంటారు ఎక్కువ మంది సినీ నటులు. ఈ మధ్య సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్న సినీ నటుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సినిమాలనుంచి రాజకీయాలలోకి వెళ్లి  కొంతమంది వ్యక్తులు విజయం సాధిస్తే...  కొంతమందికి మాత్రం చేదు అనుభవం ఎదురవుతుంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొన్ని రోజులుగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అంటూ  తెగ ప్రచారం జరుగుతోంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత పార్టీ పెడతారా లేదా బీజేపీలో చేరతారా అన్న దానిపై మాత్రం సందేహం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికి బీజేపీ చాలా సార్లు రజిని కాంత్ తో మంతనాలు జరిపింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కేంద్రమంత్రి రాధాకృష్ణన్ తో  రజనీకాంత్ భేటీ కావటంతో  బీజేపీలో చేరతారని వాదనలు  మరింత ఊపందుకున్నాయి.సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ వైడ్ గా  సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈ క్రమంలో  రజనీకాంత్ ని బీజేపీ లో చేర్చుకోవడం వల్ల దక్షిణాదిలో పాగా వేసేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 



 అయితే తాజాగా రజనీకాంత్ దీనిపై స్పందించారు. ప్రముఖ తమిళ కవి తత్వవేత్త తిరువళ్ళువర్ కు  కాషాయరంగు పులిమినట్లుగా తనకు కాశాయ  రంగు పులిమెందుకు  బిజెపి ప్రయత్నిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పతనని  బిజెపిలోకి లాగేందుకు   ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కానీ తాను తిరువల్లువర్ లాగా  బిజెపికి చేతికి వ్యక్తిని  కాదని తెలిపారు. బీజేపీకి తానెప్పుడూ అనుకూలం కాదని తెలిపిన రజనీకాంత్... తన భావజాలం వేరే అని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం రజినీకాంత్ మాటల్లో  తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. రజనీకాంత్ తాజా వ్యాఖ్యలతో రజనీకాంత్ బీజేపీలో చేరతారని చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం పటాపంచలైపోయింది. ఒకరకంగా బిజెపి పెద్దలకు ఇది షాక్  లాంటిదే అని చెప్పాలి.. 



 అయితే బీజేపీలో చేరను  అంటూ స్పష్టం చేసిన రజనీకాంత్ సొంత పార్టీ తోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీలో చేరిన తత్వవేత్త తిరువళ్ళువర్ కు బిజెపి నేతలు హిందుత్వాన్ని ఆపాదించడం  తమిళనాడులో గత కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది. తిరువళ్ళువర్ కు భుజాలపై విభూతి మెడలో రుద్రాక్షలు ఉన్నట్లు బిజెపి ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను విడుదల చేసింది దీంతో ఇది కాస్తా ప్రస్తుతం తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు దేవుడిపై నమ్మకం ఉన్న తిరువళ్ళువర్ నుంచి డీఎంకే కమ్యూనిస్టు పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అంటూ బీజేపీ కట్విట్  చేసింది. కాగా ప్రస్తుతం ఈ అంశం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: