ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో  మెరుగైన విద్య వైద్యం గురించి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన విద్య వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన వైద్యం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా పేద ప్రజలందరూ తమ తమ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి చేయూతనిస్తూ అమ్మ ఒడి పథకానికి ఊపిరి పోశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింటిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. 



 ఈ నేపథ్యంలోనే మొదటి విడతగా ఒకటో తరగతి నుంచి 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించింది. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే  నిర్ణయం పై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజాగా ప్రతిపక్షాల విమర్శలపై  స్పందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాలపై చర్చించిన తర్వాతే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో  ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం నిర్ణయం పై  పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 



 ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమం పై పట్టు ఎంతైనా అవసరమని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఎంతో నైపుణ్యం ఉంది అని తెలిపిన మంత్రి... పేద విద్యార్థుల అభివృద్ధి చెందడానికి  ఆంగ్ల మాధ్యమం బోధన తప్పనిసరి అని తెలిపారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ  తీసుకున్న సంచలన నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
.


మరింత సమాచారం తెలుసుకోండి: