ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకులూ ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా అతని పని అతను చేసుకుంటూ ఆంధ్ర ప్రజల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తున్నాడు సీఎం జగన్. 

                             

పుట్టిన పాప నుండి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలను విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

                              

అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుండి  అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తొలిదశలో 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేయాలని భావించినప్పటికీ ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

                               

నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ అధికారులను సీఎం జగన్ ఇలా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సరైన ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా నవంబరు 14న ప్రారంభం అవ్వనున్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ భాషకు సంబంధించి ప్రయోగశాలను ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: