అయోధ్యపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం. గొగోయ్ ఈ నెల 17న రిటైరవుతున్న తరుణంలో.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనాలు మరో నాలుగు కీలక తీర్పులు ఇవ్వనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీల్లో ఈ తీర్పులు ఉంటాయి. 


సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం ఇవ్వనున్న నాలుగు కీలక తీర్పుల్లో ఒకటి రాఫెల్ రివ్యూ పిటిషన్లకు సంబంధించినది. రాఫెల్ డీల్‌ను సమర్ధిస్తూ 2018 డిసెంబర్ 14న కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వేసిన రివ్యూ పిటిషన్లు వేశారు. సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లపై తీర్పును గత మేలో రిజర్వ్ చేసింది. 


ఇక రెండో కేసు... బీజేపీ ఎంపీ meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి లేఖి వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధిక్కార పిటిషన్‌ను లేఖి వేశారు. రాఫెల్ వ్యవహారంలో చౌకీదార్ చోర్ హై అంటూ ప్రధాని మోడీపై రాహుల్ ఆరోపణలు చేశారంటూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే తన వ్యాఖ్యలకు ఆ తర్వాత రాహుల్ క్షమాపణ చెప్పారు.


మరోవైపు సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అనే దానిపై కూడా రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం వచ్చే వారంలోనే కీలక తీర్పు ఇవ్వనుంది. దీనిపై తీర్పును గత ఏప్రిల్ 4న రిజర్వ్ చేశారు. ఇక నాలుగవ కీలక తీర్పు... శబరిమల అయ్యప్పకు సంబంధించినది. అయ్యప్ప ఆలయంలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళందరికీ ప్రవేశం కల్పిస్తూ.. 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ వేసిన పిటిషన్లపై తీర్పు రావాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: