బెర్లిన్ గోడను కూల్చి...ముప్ఫై ఏళ్లవుతోంది. ప్రతీ ఏటా నవంబరు 9న ఉత్సవాలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా వేడుకలకు భారీగా ఖర్చు చేశారు. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి...ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 


1961 ఆగస్టులో బెర్లిన్​ గోడ నిర్మించారు. బెర్లిన్ గోడ మొత్తం 30 మైళ్ల  పొడవు ఉంటుంది. 1989లో అప్పటి జర్మనీ సోషలిస్ట్​ యూనిటీ పార్టీ ఫస్ట్​ సెక్రటరీ గుంతర్​  ష్వాబోస్కీ ఈ అడ్డుగోడ లేకుండా చేశారు. రెండు జర్మనీల మధ్య రాకపోకలకు  అనుమతించారు. ఆర్థిక వ్యత్యాసాల్లేకుండా సాలిడారిటీ ట్యాక్స్​ను కూడా తొలగించారు.  అదే ఏడాది నవంబర్​ 9న, 28 ఏళ్లపాటు అడ్డంగా నిలబడ్డ గోడను, ప్రజలు కేరింతలతో  బద్దలుగొట్టారు. బెర్లిన్ గోడ కూలిపోయి 30 ఏళ్లయింది. రెండు దేశాల మధ్య ఈ 30 ఏళ్లలోనూ అరమరికలు లేని  వాతావరణము ఏర్పడింది. కోల్డ్​ వార్​ ముగిసిపోయింది. తమను 40 ఏళ్లపాటు చీల్చి పాలించిన సోవియట్​ యూనియన్​  కుప్పకూలిపోయింది. 


బెర్లిన్ గోడ కట్టిన తర్వాత సోషలిజం చెరలో ఉండలేక దాదాపు లక్షా  85 వేల మంది ఈస్ట్​ జర్మన్లు బెర్లిన్​ గోడను దాటినట్లుగా లెక్కలున్నాయి. వీరిలో  సైనికులు, పోలీసులుకూడా ఉన్నారు. కొందరు బెర్లిన్​ గోడ కింద టన్నెల్​ తవ్వుకుని  పారిపోయారు. మరికొందరు సరిహద్దుల్లోని సరస్సులు ఈదుకుంటూ దాటేశారు.  నడుస్తున్న రైళ్ల నుంచి దూకినవాళ్లు కొందరైతే, కార్లలో రహస్యంగా పారిపోయి దాక్కున్నవారు మరికొందరు. 


​గోడ బద్ధలై రెండు జర్మనీలు ఒక్కటైన చారిత్రక సందర్భాన్ని  రాజధాని నగరం​లో ప్రతీ ఏడాది గొప్పగా నిర్వహిస్తుంటారు. డిక్టేటర్​షిప్​కి బలైనవాళ్ల  త్యాగాల్ని గుర్తుచేసే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్స్​ని జరుపుకుంటూ ఉంటారు. తూర్పు,  మధ్య యూరప్​లలో​ శాంతియుతంగా జరిగిన తిరుగుబాటులోని ముఖ్య ఈవెంట్లను  నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపాలనే లక్ష్యంతో వందకు పైగా ప్రోగ్రామ్​లను  వండర్​ఫుల్​గా ప్రదర్శించారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఈ నెల 4న ప్రారంభమైన  ఉత్సవాలు ఇవాల్టితో  ముగిశాయి. ఈ 30వ యానివర్సరీ కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ వేడుకలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: