అయోధ్య తీర్పు.. నిన్నటి నుండి ట్రేండింగ్ టాపిక్ ఇది.. కారణం 15 శతాబ్దాల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అయోధ్య వివాదానికి నిన్న హైకోర్టులో తెర పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం నిన్న కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పుపై పలువురు ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

                        

తీర్పు వెలువడిన మరుసటిరోజు అయిన ఈరోజు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎక్కడ చూసినా శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. మార్కెట్లలోని దుకాణాలు అన్ని తెరుచుకున్నాయి. సామాన్యులు తమ కార్యకలాపాల్లో సాధారణంగా పాల్గొంటున్నారు. పోలీసులు పహారా కాస్తున్నారు. 

                     

ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా ఈరోజు పీహెచ్‌క్యూలోని కంట్రోల్ రూం నుంచి రాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నిన్నటితో పోల్చిచూస్తే భోపాల్‌లో ఈరోజు సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్, సాగర్, రీవా, ఉజ్జయిని తదిర ప్రాంతాల్లోను పోలీసు నిఘా కొనసాగుతోంది. అయితే ఎన్నో శతాబ్దాల నుండి భూవివాదం ఉన్నప్పటికీ ఆసక్తిగా ఎదురు చూడగా నిన్న తీర్పు వెలువడింది. 

                           

కాగా ఈ తీర్పు దేశం ప్రజల నుండి ప్రముఖులు వరుకు ప్రతిఒక్కరు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అయోధ్య తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా అయోధ్య తీర్పుపై స్పందించి అయోధ్య స్థలంలో మసీదు బదులు పేద పిల్లల చదువుకోసం కాలేజీ, పాఠశాల కడితే మంచిదని అన్నారు. 


              

మరింత సమాచారం తెలుసుకోండి: