ఒక‌ప్పుడు ఆడ‌వారు అంటే అణ‌కువ అని అనేవారు. మ‌రి ఇప్పుడు ఆడ‌వారంటేనే సొసైటీ భ‌య‌ప‌డే లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు కొంద‌రు మాయ‌లేడీలు. దానికి కార‌ణాలు ఏమైనా  కావొచ్చు కాని ఇది నిజం. టెక్నాల‌జీ పెరిగే కొద్దీ వాటిని మంచి ప‌నుల కంటే ఎక్కువ‌గా ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌కే వాడుతున్నారు. అది మేల్ కాని ఫిమేల్ కానీ ఎవ‌రైనా స‌రే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్ట‌ర్ లాంటివి ఎన్నో సోష‌ల్ మీడియాల‌ను వాడుతూ వాటిలో కొంత‌మంది మాయ లేడీలు సోష‌ల్ మీడియాలో డ‌బ్బుల కోసం కొంత‌మందికి వ‌ల‌పు వ‌ల‌ను విసురుతున్నారు. 


ఈ విష‌యంలో చాలా మంది మోస‌పోయిన‌వారు ఉన్నారు. వారిలో కొంత మంది పోలీసుల‌ను కూడా ఆశ్ర‌యించ‌డానికి సంకోచిస్తున్నారు. పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం వ‌ల్ల వాళ్ల ప‌రువుపోతుంద‌ని కొంద‌రు మ‌రి కొంద‌రు వేరే వేరే కార‌ణాల వ‌ల్ల చెప్ప‌లేక‌పోతున్నారు. ఇలా పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేసిన‌వారు చాలా త‌క్కువ‌నే చెప్పాలి.


హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి నెల రోజుల వ్యవధిలో మాయలేడి వలకు చిక్కి రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు. తనకు వల వేసిన  మహిళ ఎవరనే విషయాన్ని  ఆరా తీస్తే తనతో కలిసి పనిచేసిన యువతే  తన నుండి డబ్బులు లాగిందని ఆరా తీయ‌గా  తనతో కలిసి పనిచేసిన యువతే  తన నుండి డబ్బులు లాగిందని గుర్తించాడు. ఇదిలా ఉంటే ఓ ప్రైవేట్ సంస్థలో ప‌ని చేస్తున్న వ్య‌క్తిని ఓ తెలియ‌ని వ్య‌క్తి వాట్సాప్ ద్వారా ప‌ల‌కరించింది. నెమ్మ‌దిగా మాట‌లు క‌లిపి అత‌నితో చాటింగ్ చేయ‌డం మొద‌లు పెట్టింది.  నెమ్మ‌దిగా అతడికి వ‌ల వేసి  ఆమె ఫోన్ ట‌చ్‌లో లేకుండా త‌న‌కు ఆరోగ్యం స‌రిగా లేదంటూ చెప్ప‌సాగింది.  హాస్ప‌త్రిలో చావుబ్ర‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న‌ట్లు తెలిపింది. దాంతో అత‌ను న‌మ్మి వెంట‌నే భ‌య‌ప‌డి  అత‌ని భార్య న‌గ‌లన్నీ తాక‌ట్టు పెట్టి ల‌క్ష‌రూపాయ‌లు పంపించాడు.  ఆ త‌ర్వాత గాని తెలియ‌లేదు అదంతా ఆబ‌ద్ధం త‌ను మోస‌పోయాన‌ని. 


సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని వలపు వలతో ట్రాప్ చేస్తున్నారు. డబ్బులు లాగిన తర్వాత చెప్పాపెట్టకుండా ఫోన్ నంబ‌ర్లు, కాంటాక్ట్ కి సంబంధించిన ప్ర‌తిదీ మార్చేయ‌డంతో ఈ విధంగా కిలాడీ లేడీలా మోసానికి అనేక మంది మోస‌పోతున్నారు. దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం ఏమిటంటే ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగినప్పుడు పోలీసుల‌కు ఫిర్యాదు చెయ్యాలి. ఇలాంటి కేసుల పై ఫిర్యాదులు చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని ఉన్న‌తాధికారులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: