అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్‌న్యూస్‌. హెచ్‌-1బీ వీసాదారుల లైఫ్‌ పార్టనర్స్‌కు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్‌ సర్కార్‌కు అక్కడి కోర్టు షాక్‌ ఇచ్చింది. ట్రంప్ సర్కార్‌ ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది న్యాయస్థానం.


హెచ్‌1-బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భావిస్తోన్న అమెరికా జోరుకి అక్కడి న్యాయస్ధానం బ్రేకులు వేసింది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్‌ సర్కార్‌ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎస్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ అప్పీల్‌ కొలంబియా సర్క్యూట్‌ దిగువ కోర్టును కోరింది. 


హెచ్‌-1 బీ నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ట్రంప్‌ సర్కార్‌కు కోర్డు ఆదేశించింది. అప్పటి వరకు రూల్స్‌కు నిలపాలని ట్రంప్ ప్రభుత్వానికి సూచించింది. అదే విధంగా ఫైనల్‌ తీర్పును కూడా నిలిపివేయాలని కోరింది. హెచ్‌-1బీ వీసాదారుల లైఫ్‌ పార్ట్‌నర్స్‌కు పని అనుమతులు కల్పిస్తూ అమెరికా 2015 లో ప్రవేశపెట్టింది. ఐతే దీని ద్వారా అమెరికా వాసులు నష్టపోతున్నారని ట్రంప్‌ సర్కార్‌ భావించింది. దీంతో హెచ్‌ 4 వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది.

 

అంతకు ముందు హెచ్‌-1 బీ దరఖాస్తు రుసుమును పెంచిది. 10 డాలర్లు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.. హెచ్‌-1 బీ క్యాప్‌ సెలక్షన్‌ విధానాన్ని మరింత సమర్థవంతం చేయడానికి ఎలక్ర్టానిక్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. ప్రస్తుత కోర్టు తీర్పుతో ఇండియన్స్‌ వీసా ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు. మొత్తానికి అమెరికా న్యాయస్థానం ట్రంప్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చింది. భారతీయుల్లో ఉత్సాహం నింపింది. ఇంకేముందీ హెచ్ 1బీ వీసా విషయంలో కొన్ని నిబంధనలు సడలించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇండియన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నారు. న్యాయస్థానం ద్వారా స్వేఛ లభించేందుకు మార్గం సుగమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: