చేపలు అనగానే లొట్టలేసుకునే వాళ్లు చాలామందే ఉంటారు. అది ఏ రకమైన చేప. అందులో ముళ్లుంటాయా.. ఉండవా.. !  ఎన్ని కేజీలు ఉంటుంది..?  తెచ్చుకుంటే.. కర్రీకి బాగుంటుందా..?  ఫ్రైకు బాగుంటుందా..?  అని మాట్లాడుకుంటారు. కానీ ఒక వింతైన చేప మనుషుల కంట పడింది. చేపల్లో చాలా రకాలుంటాయనేది మనకు తెలుసు. వాటి రకాల గురించి చాలా విన్నాము. కానీ అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉన్న చేప గురించి విన్నారా..? నమ్మడం లేదా..? అయితే మీరే చూడండి. 


చేపల్లో చాలా రకాలుంటాయి. పులస.. కొరమేను.. మట్టగిడస నుంచి సొర వరకూ చాలా చేపల్ని మనం చూశాం. డాల్ఫిన్స్‌ చేసే విన్యాసాలు చూశాం. కానీ చైనాలో ఓ చేప మాత్రం మనిషి ముఖాన్ని పోలి ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. చేప ఏంటి మనిషి ముఖంతో ఉండటం ఏంటని ప్రశ్నించుకుంది. చైనాలోని మియో గ్రామానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి నీటి ప్రవాహంలో ఈ చేప కనిపించింది. దీంతో వెంటనే సెల్‌ఫోన్‌లో ఆ వెరైటీ ఫిష్‌ను వీడియో తీసింది. 


వెంటనే చైనా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ లో ఈ వీడియో పోస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా వైరల్‌ అయింది. నీటిలో ఈదుకొంటూ వస్తున్న చేప ముందు భాగం మనిషిని పోలినట్టు కళ్లు, ముక్కు, నోరు కనిపించాయి. ఈ చేపను చూసిన నెటిజన్‌లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రకరకాల చేపల్ని చూడటానికి అందరూ ఇష్టపడతారు. అటువంటి వారు ఈ చేపను చూస్తే మళ్లీ వాటి జోలికి వెళ్లరు. భయంకరంగా ఉన్న ఈ చేపను చూసి ఎవరైనా ధైర్యంగా తినగలరా అని పోస్టులు పెడుతున్నారు. 


అక్వేరియమ్ లో చాలామంది చాలా చేపలను చూసే ఉంటారు. ఇలాంటి చేపను మాత్రం ఎపుడూ చూసి ఉండరు. మనిషి ముఖాన్ని పోలిన ఈ చేపను సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: