కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం 10.30 రైలు ప్రమాదం జరిగింది. ఆగివున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. దీంతో 35 మంది పాసెంజర్స్ గాయాల పాలయ్యారు. కొంత మందిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించగా మిగిలిన వారికి ఇతర హాస్పిటల్ లకు తరలించారు. సిగ్నల్స్ గమనించకుండా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్.. నాలుగో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న ఇంటర్‌సిటీని ఢీకొట్టింది.
 
దీంతో ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయాడు. అతనిని బయటకి తీసేందుకు రైల్వే రెస్క్యూ టీమ్ హుటాహుటిన అక్కడికి పొద్దున్న చేరుకుంది. పొద్దుటనుంచి ఇప్పటి వరకు గ్యాస్ కట్టర్లతో సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత చివరికి లోకో పైలట్ ను  క్షేమంగా బయటకి తీయగలిగింది. 
తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ని కేర్ ఆసుపత్రికి తరలించారు. మొదట సిగ్నల్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని....సిగ్నల్ వ్యవస్థ లో ఎటువంటి లోపం లేదని రైలు అధికారి అయినా రాకేష్ చెప్పారు. లోకో పైలట్ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు రైల్వే అధికారులు. 


సిగ్నల్ ఇవ్వకుండా చంద్రశేఖర్ రైలును ఎందుకు ఆ ట్రాక్ పైకి తీసుకెళ్లాడో ఉన్నత స్థాయి దర్యాప్తు చేసి త్వరలోనే వెల్లడిస్తాం అని అధికారాలు తెలిపారు. 
ప్రస్తుతం ఈ మార్గం లోని లోకల్ రైళ్లను రద్దు చేసారు. అదృష్టం వల్ల ఒక రైలు ఆగివుండడంతో ఓ పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌కు చెందిన మూడు కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో 600 పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: