సమాజంలో చాలామంది కటిక పేదరికంతో కొట్టుమిట్టాడుతుంటారు. తినడానికి కనీసం నాలుగు మెతుకులు కూడా లేనంత  దీనస్థితిలో ఉంటారు. ఇలాంటి కొన్ని ఫోటోలను కొంతమంది జర్నలిస్టులు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా వారికి ఏదైన చేయూతను  అందించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. ఓ జర్నలిస్ట్ ఓ  చిన్నారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ అవుతుంది. ఆ జర్నలిస్ట్  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఓ చిన్నారి తన ఈడు పిల్లలందరూ స్కూల్లో చదువుతుండగా... స్కూల్ బయట కాలి గిన్నె  పట్టుకొని క్లాస్ రూమ్ లోకి దీనంగా చూస్తూ భోజన సమయంలో తనకు కూడా ఓ నాలుగు మెతుకులు వేయకపోతారా కడుపునిండక పోతారా  అంటూ దీనంగా బయట నిలబడి చూస్తుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా  ఈ ఫోటో చాలా మందిని కలిచి వేసింది. 

 

 

 

 ఆకలి చూపు అనే టైటిల్ తో ఆ జర్నలిస్టు ఈ ఫోటోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఈ ఫోటో చూసిన వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త చలించిపోయారు. ఆ బాలిక జీవితంలో వెలుగులు నింపాలని అనుకున్నారు ఆయన. వెంటనే ఆ బాలిక అడ్రస్ కనుక్కొని వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. ఆ ఫోటోలు ఉన్న బాలిక పేరు మోతీ  దివ్య. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ మురికివాడలో ఉండే ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుని  దాన్ని అమ్మి బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటారు . తల్లిదండ్రులు చెత్త ఏరుకోవడానికి వెళ్లగానే ప్రతిరోజు స్కూల్ వద్దకు వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం ఆ ఫోటోలు చూపించిన  లాగే దీనంగా చూస్తూ ఉండేది. 

 

 

 

 ఈ విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి ఆ చిన్నారి తల్లిదండ్రులను ఒప్పించి ఆ బాలిక ఏ పాఠశాల వద్ద నాలుగు మెతుకుల కోసం పడిగాపులు కాసేదో అదే  స్కూల్లో చేర్పించారు ఆయన. ఇప్పుడు మోతీ  దివ్య స్కూల్ బయట మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూడకుండా అందరూ విద్యార్థుల లాగానే  చక్కగా యూనిఫాం వేసుకుని స్కూల్ కు  వెళ్తుంది. ప్రస్తుతం దివ్య  గుడిమల్కాపూర్ లో ఉన్న దేవల్ ఝామ్  సింగ్  గవర్నమెంట్ హై స్కూల్ లో చదువుకుంటుంది. కాగా  ఆ జర్నలిస్టు పోస్ట్ చేసిన ఒక్క పోటు ఈ చిన్నారి జీవితాన్నే మార్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: