బాలధాకరే పోరాటం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా సాగింది. ఆయన మొదటి నుంచి హిందూత్వ సిధ్ధాంతం మీద నిలబడ్డారు. అదే విధంగా మరాటాల  హక్కుల కోసం ఎంతకైనా అన్నట్లుగా తెగించి పోరాడారు. బాల్ థాకరేను అచ్చమైన‌ వారసుడు ఆయన అన్న కొడుకు నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే అనేవారూ అప్పట్లో ఉన్నారు. అయితే పుత్ర వాత్సల్యంతో బాల్ థాకరే తన సొంత కొడుకు ఉద్ధవ్ థాకరేను బయటకు తెచ్చాడని అంటారు.


అయితే బాల్ ధాకరే రెబలిజం. దూకుడు అన్నీ కూడా రాజ్ కే వచ్చాయని చెబుతారు. ఆయన నవనిర్మాణ సేన పెట్టినా పెద్దగా వెలగలేకపోయారు. ఇక తండ్రి  ఆర్జించి పెట్టిన శివసేన ద్వారా ఉద్ధవ్ థాకరే రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఆయన రాజకీయం ఏంటో బీజేపీతో తరచూ గొడవలు పడుతూండంతోనే బయటపడిపోయింది. ఇక అయిదేళ్ల మహారాష్ట్ర  బీజేపీ  ఫడ్నవీస్ పాలన పైనా కేంద్రంలోకి మోడీ పాలన పైనా కూడా ఉద్ధవ్ ఠాక్రే  ఎప్పటికపుడు విసుర్లు విసురుతూనే వచ్చారు. ఇక ఆయన తాజా ఎన్నికల ఫలితాల తరువాత  మొండితనానికే వెళ్లారు.  సీఎం సీటు కోసం తెగించేస్తున్నారు. అది ఎంతదాకా వెళ్ళిందంటే సిధ్ధాంతపరంగా బధ్ధ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ తో కూడా పొత్తుకు రెడీ  అనేంతవరకూ.


బాల్ ధాకరే అంటే పులి. ఆయన గర్జన ముంబైలో చేస్తే పాలకులు ఎవరైనా వణికేవారు. ఇక బాల్ థాకరే సోనియా గాంధీ విదేశీ నాయకత్వం మీద ఎన్నో వ్యాసాలు తన సామ్నా పత్రికలో రాశారు. ఆయన కాంగ్రెస్ నాయకులను సోనియమ్మ దగ్గర వంగిపోయారని హాట్ కామెంట్స్ చేసేవారు. ఇపుడు స్వయంగా ఆయన కుమారుడే అధికారం కోసం పార్టీని పాదాల కింద పెట్టేశారని బీజేపీ నేతలు అంటున్నారు. పులి లాంటి శివసేన పిల్లి అయిందని అంటున్నారు. మరి శివసేన ఎందుకు ఇంతలా ఆరాటపడిపోయి మరీ అధికారం కోసం సిధ్ధాంతాలను ఫణంగా పెడుతోందని అంతా ఆశ్చర్యపోతున్నారు. పార్టీ ఓడితే మళ్ళీ గెలవవచ్చు. కానీ సిధ్ధాంతం ఓడితే గెలుస్తారా... 



మరింత సమాచారం తెలుసుకోండి: