చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా పులిలా కనిపించేవారు. ఆయన మాటే శాసనంగా ఉండేది. అయితే ఎపుడైతే బాబు 23 సీట్లకు పడిపోయారో నాటి నుంచే రోజులు మారిపోయాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాబును వణికిన వారే ఇపుడు తోక జాడిస్తున్నారు. బాబుకు అన్నీ తెలుసు. అయినా ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి ఆయనది.


సొంత సామాజికవర్గం కమ్మ వారు ఇపుడు చంద్రబాబుకు చాలా దూరంగా ఉంటున్నారు. నిజంగా టీడీపీ అంటేనే తమ పార్టీ అని బలంగా ముద్ర కొట్టుకున్న కమ్మ వారు ఇపుడు బాబుని కష్టాల్లో ఉంటే కనీసం పక్కన నిలబడలేదంటే ఆశ్చర్యపోవాలిందే. కమ్మ సామాజికవర్గం బలంగా ఉంటుంది. వారు ఆర్ధికంగా అంగ బలం ఉన్నవారు. మరి వారు కనుక ఈ కీలక టైంలో బాబుకు  అండగా నిలబడితే టీడీపీకి కొంత అయినా ఉపశమనం కలిగేది. కానీ మొత్తంగా టీడీపీ గెలిచినవి 23 సీట్లు అయితే అందులో కమ్మ సామాజికవర్గం నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెలేలలో ఒక్క చంద్రబాబు తప్ప మిగిలిన పది మంది నోళ్ళూ ఏమయ్యాయి అని ఆరా తీస్తే సమాధానం నిల్ అని వస్తుంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైకిల్ దిగిపోతానని అంటున్నారు. మరో వైపు  మరో ఎమ్మెలే గద్దె రామ్మోహనరావు సైలెంట్ అయ్యారు. ప్రకాశంలో గొట్టిపాటి రవికుమార్  ఆయన ప్రత్యర్ధి కరణం బలరాం వంటి వారు కూడా దూకుడు పెంచడం లేదు.


ఇక ఉప నాయకుడిగా బాబు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరిని తీసుకుంటే ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక విశాఖలో చూసుకుంటే వెలగపూడి రామక్రిష్ణ బాబు తన నియోజకవర్గం దాటి రాలేకపోతున్నారు. సొంత బావమరిది, సినీనటుడు బాలక్రిష్ణ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కమ్మ ఎమ్మెల్యేలకు పార్టీ పట్టడమేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్నారు. మళ్లీ వీరంతా ఎన్నికల వేళ మాత్రమే యాక్టివ్ అవుతారు. అంతవరకూ బాబు ఒక్కరే  భారం మోయాల్సిందే.
.


మరింత సమాచారం తెలుసుకోండి: