లిఫ్ట్ అడుగుతారు ఆ తర్వాత పాపం అని లిఫ్ట్ ఇచ్చాక  దారిలో నిలువునా దోపిడీ చేసేస్తారు . ప్రస్తుతం దోపిడీలో ఇదో ట్రెండ్  అయిపోయింది. ఒంటరిగా బైక్ పై  వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తారు. రోడ్డుపై ఒక్క నిలబడి లిఫ్ట్ కావాలంటూ అడుగుతారు. అయ్యో పాపం అని కొంచెం జాలిపడి బైక్ ఆపాము  అనుకోండి మన  మీద జాలి చూపించకుండా నిలువునా దోచేస్తారు. ఇలాంటి దోపిడీలు ఎన్నో తెరమీదకు వచ్చాయి ఇప్పుడు తాజాగా ఇలాంటి దోపిడి చేసే మరో ముఠా పట్టుబడింది. ఒంటరిగా వెళ్తున్న వాహనదారులు టార్గెట్ చేసి  లిఫ్ట్ అడుగుతారు లిఫ్ట్ అడగ్గానే... వెనకే  దోపిడీ ముఠా మొత్తం వాహనాన్ని ఫాలో అయ్యి   దోపిడీకి పాల్పడి లిఫ్ట్ ఇచ్చిన  వ్యక్తి దగ్గర ఉన్న సెల్ ఫోన్  డబ్బులు లాగేసుకుని పారిపోతారు. ప్రస్తుతం ఇలా దోపిడీకి పాల్పడుతున్న ముఠా ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

 

 

 తెలంగాణలోనే జడ్చర్ల సమీపంలో ఈ నెల 10వ తేదీన బూరుగుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాములు అనే వ్యక్తి ఒంటరిగా బైక్ పై వస్తున్నాడు ... కాగా  నాగ సాల గ్రామంలో ఓ  వ్యక్తి రాములుని  లిఫ్ట్ అడగడంతో... ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి బైకుపై ఎక్కించుకున్నాడు రాములు. కాసేపటికి తర్వాత  లిఫ్ట్ అడిగిన వ్యక్తి  బైక్ ఆపి బెదిరించి రాములు వద్ద ఉన్న  18,00 నగదు సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ దోపిడీ ముఠా కోసం  విచారణ ప్రారంభించారు. 

 

 

 

తాజాగా  నిమ్మబాయిగడ్డ  ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేసారు. వచ్చిన కొంతమంది యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. అసలు విషయం బయటపడింది. అఖిల్ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టమ్ కళ్యాణ్, రాపల్లె  చంద్రుడు, వాడిత్యవత్ శివ, శివగళ్ళు  రాజ్ కుమార్, నాయుడు దుర్గా రాజ్ కుమార్ లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గరి  నుంచి మూడు బైకులు ఒక ఆటో స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అయితే నిందితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని ఉపాధి నిమిత్తం జడ్చర్ల ప్రాంతానికి వచ్చి టిఫిన్ సెంటర్ లో పనిచేస్తున్నారు అంటూ పోలీసులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: